శరీర మెటబాలిజం యాక్టివ్‌గా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. అయితే బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎంత హెల్దీగా ఉంటే అన్ని లాభాలు.
Breakfast
బరువు తగ్గాలనుకునే చాలామంది బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే లేదా తగ్గిస్తే త్వరగా బరువు తగ్గొచ్చు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌తోనే బరువు తగ్గడం ఈజీ అవుతుంది.
ఉదయం తీసుకునే ఆహారమే రోజు మొత్తంలో ముఖ్యమైన ఆహారం. బరువు తగ్గాలన్నా, మెటబాలిజం పెరగాలన్నా.. బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా తీసుకోవడం చాలా అవసరం. కానీ చాలామంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఎంతో ముఖ్యమైన బ్రేక్‌ఫాస్ట్ విషయంలోనే చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్ టైంలో శక్తినివ్వని జంక్ ఫుడ్స్ తింటుంటారు. బ్రేక్‌ఫాస్ట్ అంటే లైట్‌గా ఉండాలని తక్కువ మొత్తంలో తింటుంటారు.