సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధానిలో కీలకమైన రైల్వేస్టేషన్ వద్దకు అంత మంది వచ్చి విధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. విధ్వంసమే పరిష్కారం అయితే ఇక ప్రపంచమే ఉండదన్నారు. రైల్వే పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించే అవకాశం ఉండదని, ఇది పూర్తి రాష్ట్ర పరిధిలోని శాంతిభద్రతల అంశమని.. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. […]