BJP

ప్రధాని నరేంద్ర మోడీ మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ రానున్నారు. జూలై 2న హెచ్‌ఐసీసీలో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాతి రోజు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు దేశ ప్రధాని నగరంలోనే ఉండనుండటంతో ఇప్పటికే ఆయనకు రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నగరానికి చేరుకుంది. తెలంగాణ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మోడీ సెక్యూరిటీని పర్యవేక్షించనుంది. కాగా, జూలై 2వ తేదీ […]

2024 ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఆ మధ్య మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ మాట మార్చిన సంగతి తెలిసిందే. జనసేనకు ఈసారి అధికారం ఇవ్వండి, మార్పు ఎలా ఉంటుందో చూపిస్తామంటూ పవన్ పదే పదే తన ప్రసంగాల్లో పేర్కొంటున్నారు. కనీసం బీజేపీ ప్రస్తావన కూడా ఆయన తేవడంలేదు. ఇప్పుడు బీజేపీ కూడా అదే రూట్లో ప్రచారం మొదలు పెట్టింది. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనంటున్నారు […]

మరో 6 రోజుల్లో హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ఆ పార్టీ అగ్ర నాయకులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో సహా అతిరథ మహారథులంతా హాజరవుతున్నారు. దాంతో ఈ సమావేశాల ఏర్పాట్లను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ ప్రతిష్ఠ‌గా తీసుకున్నారు. తన అతిథి మర్యాదలు, ప్రచారం చూసి అగ్రనాయకత్వం డంగై పోవాలని సంజయ్ భావిస్తున్నారు. అందుకోసం నగరం […]

షెడ్యూల్ ప్ర‌కారం 2024లో జ‌ర‌గ‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం రాజ‌కీయ ప‌క్షాలు ఇప్ప‌ట్నుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. అధికార వైసీపీ మొత్తం 175 సీట్ల‌ను సాధించాలంటూ ప‌ట్టుద‌ల‌గా ఉంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌యాన్ని ఎమ్మెల్యేల‌కు గుర్తుచేస్తూ ప‌నితీరు స‌రిగా లేని వారిని గ్రాఫ్ పెంచుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇక మ‌హానాడు ఇచ్చిన ఊపుతో ఉన్న తెలుగుదేశం పార్టీ వ‌చ్చేఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని గ‌ట్టిగా కృషి చేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే జిల్లాల్లో […]

మహారాష్ట్రలో ప్రభుత్వం సంక్షోభంలో కురుకుపోయిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. ఆయన ఆ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరతారానే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతల వ్యవహారశైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడతామని చెప్పుకొనే ఆ […]

దమ్ము‍ంటే తన మీద కేసులు పెట్టాలని ఇంజినీర్లు, చిన్నా చితకా కార్మికులపై కాదంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రజల సౌకర్యంకోసం ఐడీపీఎల్ దగ్గర రోడ్డు వేస్తుంటే కేసులు పెట్టాలని కేంద్రమంత్రి ఆదేశాలిస్తున్నారు అని కేటీర్ మండిపడ్డారు. మంచి చేయరు చేస్తున్నవాళ్ళను అడ్డుకుంటారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆ కేంద్రమంత్రికి చేతనైతే కంటోన్మెంట్ తో సహా హైదరాబాద్ నుండి కరీంనగర్‌, రామగుండం, ఆదిలాబాద్‌ వెళ్లే మార్గంలో రక్షణ రంగానికి […]

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో ప్రచార పర్వానికి తెరపడింది. సాయంత్రం 6 గంటలకు మైక్ లు మూగబోయాయి. స్థానికేతర నాయకులెవరూ నియోజకవర్గ పరిధిలో ఉండటానికి వీల్లేదంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో.. ఎక్కడివారక్కడ తమ సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. ఉప ఎన్నికలో మొత్తం 14మంది బరిలో ఉండగా.. ఈనెల 23న పోలింగ్ జరగాల్సి ఉంది. 26వ తేదీన కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెలువడతాయి. లక్ష టార్గెట్..! ఆత్మకూరు ఉప ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా […]

కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్ పయిరీ డేట్ అయిపోయిన మెడిసిన్ లాంటిదని, దానికి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని విమర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. పార్టీ అధినేత రాహుల్ గాంధీని మూడు రోజుల పాటు విచారణ పేరుతో ఈడీ తీసుకెళ్లినా.. ఆ పార్టీలో ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక పాడెక్కడమే తరువాయి అంటూ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్.. […]

”కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నా సందేహాలు తొలగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని నాకు నమ్మకం కలుగుతోంది” అని ఆంధ్రప్రదేశ్ విభజనకు బద్ధ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిరంతరం చులకనగా, అవహేళనగా మాట్లాడుతూ వచ్చిన, మూడు దశాబ్దాలకు పైగా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్న కరుడుగట్టిన సమైక్యవాది, కోస్తాఆంధ్ర కమ్మ సామాజికవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు అప్పట్లో అన్నాడు. ఆయనే కాదు, ఆ కాలంలో చాలామంది ‘సెటిలర్లు’ తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని బల్ల గుద్ది వాదిస్తూ […]

తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం, ఏపీకి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎందుకు భేటీ అయ్యారు. అసలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటి అనే విషయంలో చాలా ఊహాగానాలు వినిపించాయి. భారత్ రాష్ట్రీయ సమితి గురించి చర్చలు జరిగి ఉంటాయని, ఏపీకి ఉండవల్లిని ఇన్ చార్జిగా ప్రకటించే అవకాశముందని కూడా వార్తలు వినిపించాయి. అయితే కేసీఆర్ తో జరిగిన చర్చల్లో అసలు […]