హైదరాబాద్ నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్న వేళ బీజెపి నాయకులకు నిద్రలేకుండా చేస్తున్నది టీఆరెస్. ఒక వైపు నగరమంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, కొన్ని చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు మోడీ ఫేల్యూర్స్ తో కూడిన వివరాలతో బై బై మోదీ అంటూ ఫ్లెక్సీలతో నగరంలో హల్ చల్ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశాలకు వస్తున్న తమ అగ్రనాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ప్ట్టడానికి, పోస్టర్లు వేయడానికి బీజేపీ నాయకులకు స్థలం దొరకని స్థితి. […]
BJP
హైదరాబాద్ కంటోన్మెంట్ లో జీవిస్తున్న ప్రజలు, మల్కాజిగిరి నుంచి నగరంలోకి వచ్చే ప్రజలు నడిచే, ప్రయాణించే దారిలేక అనేక ఏళ్ళుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మీ వాళ్ళు తమ రోడ్ల మీద ప్రజలు ప్రయాణించకుండా అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు. గేట్లను మూసి వేస్తున్నారు. ఈ విషయంపై ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు ఆర్మీ అధికారులను కలిసి విజ్ఞప్తులు చేశారు. టీఆరెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించింది. […]
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న పలువురు బీజెపి నేతలు తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అలా నియోజకవర్గాలకు వచ్చే నేతలపై ఈ ప్రశ్నలు ఎక్కుపెట్టండి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో 19 ప్రశ్నలు సంధించారు. ఆ పోస్టు వివరాలు… ”తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త […]
హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. ఊరూవాడా పోస్టర్లు వేస్తున్నారు, మోదీకోసం వంట వాళ్లకు అప్పుడే పని అప్పజెప్పారు, ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ మైండ్ గేమ్ కి బీజేపీ విలవిల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా కార్యవర్గ సమావేశాలకు రెండు రోజుల ముందు ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనన్ని స్థానాలు కైవసం చేసుకున్నామని ఆ మధ్య సంబరాలు చేసుకున్న […]
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. జూలై 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగ సభలో మోడీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరనుండటం దాదాపు ఖాయమైంది. తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహం నింపి, ఎన్నికలకు సమాయాత్త పరిచేందుకు గాను విజయ్ సంకల్ప్ పేరుతో ఈ సభ నిర్వహిస్తోంది. కాగా, సభకు ప్రధాని మోడీ హాజరవుతుండటంతో ఇతర పార్టీలో నుంచి భారీగా ముఖ్య నేతలను తీసుకొని వచ్చి చేర్పించాలని బీజేపీ భావించింది. […]
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము విజయం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా గెలుపుకోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. ఢిల్లీ వేదికగా బీజేపీకి సవాళ్లు విసిరారు. తాజాగా ఆయన ట్విట్టర్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ ని చేస్తారు మోదీజీ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేటీఆర్. సూటిగా, సుత్తి […]
తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరిందని కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం సందర్భంగా ఆ పోరు పీక్ కు చేరిందని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య కొద్ది రోజులుగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో తామే గెలుస్తామని అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న అంశంపై ఒకరిపై ఒకరు ఎత్తులు పై […]
ప్రధాని మోదీ కరీంనగర్ యాదమ్మ చేతి వంట తినబోతున్నారు. జూలై 2 నుంచి హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల్లో పాల్గొనే అతిథులకు తెలంగాణ వంటలను రుచి చూపించాలని బండి సంజయ్ నిర్ణయించారు. అందుకోసం యాదమ్మను కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రప్పించారు. తెలంగాణ వంటలు వండాలంటే అందరికీ యాదమ్మనే గుర్తొస్తుందని ప్రతీతి. ఎక్కడ పెద్ద పెద్ద సభలు, సమావేశాలు జరిగినా వంటల కోసం యాదమ్మనే పిలుస్తారు. మం త్రులు కేటీఆర్ తో సహా అనేక […]
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైనట్టు సమాచారం. ఈ రోజు ఆయనతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు భేటీ అయ్యారు. విశ్వేశ్వర రెడ్డి ఇంట్లోనే జరిగిన ఈ భేటీ దాదాపు గంటకు పైగా జరిగింది. విశ్వేశ్వర రెడ్డిని బీజేపీలో చేరవలసిందిగా తరుణ్ చుగ్ ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జూలై […]
హైదరాబాద్‌లో వచ్చే వారం జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల విజయం కోసం ఒకవైపు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా మరో వైపు ఆ పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ నగరంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు దర్శనమిస్తుండగా… మరో వైపు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాల ఫోటోలతో బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇలా పోటా పోటీ ప్రచారం నడుస్తుండగానే సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోదీకి […]