హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరైన వేళ ‘మోదీ మస్ట్ ఆన్సర్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిల్చింది. శనివారం నాడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి అనేక ప్రశ్నలు సంధించారు. వీటికి మోదీ సమాధానాలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు […]
BJP
బీజేపీ ‘విజయసంకల్ప’సభ సంగతి ఏమో కానీ కేసీఆర్ కు కావలసినంత ‘మందుగుండు’ను బీజేపీ నాయకులే సమకూర్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ‘సంకల్పాని’కి అద్భుతమైన సరంజామా కేసీఆర్ కు లభించింది. టీఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ లో ఒకప్పటి ఉద్యమకారుడు శనివారం మరలా జన్మించాడు. ప్రధాని మోడీపైన, బీజేపీ నాయకత్వంపైన, కేంద్రప్రభుత్వ విధానాలపైన ఆయన విరుచుకు పడ్డ తీరు, చెండాడిన వైనం, చెలరేగిన విధానం నాభూతో న భవిష్యత్తు వలె ఉంది. కేసీఆర్ కు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా […]
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీకి తెలంగాణలో నిరసనలు ఎదురయ్యాయి. ఒకవైపు సోషల్ మీడియాలో బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయిన నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా పలు సంఘాలు రోడ్డెక్కాయి. అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ MRPS, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా […]
రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా గెలవబోతున్నారని టీఆరెస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని ఆయన కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని జలవిహార్‌లో శనివారం సభ జరిగింది. ఆసభలో కేసీఆర్ మాట్లాడుతూ…. భారత రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ”ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. రెండు రోజుల పాటు ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఈ […]
8 ఏళ్ల పాలనలో బహుశా ప్రధాని మోదీ ఈ స్థాయిలో ర్యాగింగ్ ఎక్కడా ఎదుర్కొని ఉండరు. హైదరాబాద్ పర్యటనలో, అందులోనూ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో మోదీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్న ఈ రోజుల్లో కూడా హోర్డింగ్ లు, ప్లకార్డ్ లు పట్టుకుని వీధుల్లో నిలబడే మనుషులకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అవును.. ఇప్పుడు హైదరాబాద్ లో మోదీని టార్గెట్ చేస్తూ వేసిన హోర్డింగ్ లు […]
ఇటీవలే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. మొదటి స్థానంలో ఏపీ ఉండగా, టాప్ లిస్ట్ లో తెలంగాణ కూడా చోటు సంపాదించుకుంది. ఈ లిస్ట్ పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనే కాదు, పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా టాప్ ప్లేస్ లో ఉందని చెప్పారు. ఇక ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందన బీజేపీకి […]
బండి సంజయ్.. ఒక మామూలు పార్టీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి.. ఇవాళ బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఎదిగారు. కౌన్సిలర్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నికల బరిలో నిలుస్తూ.. ఎంపీగా విజయం అందుకున్నారు. హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ బండి సంజయ్ ఆకాశంలో తేలిపోతున్నారు. 18 ఏళ్ల క్రితం తాను కన్న కలను ఇవాళ నిజం చేసుకుంటున్నందుకు ఆయన ఉత్సహంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి సారిగా 2004లో జరిగాయి. అప్పుడు బండి […]
హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో .. రెండు రోజులపాటు బీజేపీ ‘సంబరాలు’ జరగనున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, చర్చా గోష్టులు, ఎగ్జిబిషన్లతో నగరమంతా కాషాయమయం కానుంది. ఇప్పటికే సిటీలో అనేకచోట్ల మోడీ, ఇతర బీజేపీ నేతల భారీ కటౌట్లు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పార్టీ పతాకాలతో రోడ్లపక్కన పరిసరాలన్నీ నిండిపోయాయి. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులంతా నగరంలో అడుగుపెట్టనున్నారు. 340 మందికి పైగా […]
జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం తెలంగాణకు వస్తున్న బీజేపీ నేతలు హైదరాబాద్ బిర్యానీ తిని, ఇరానీ చాయ్ తాగి వెళ్లాలంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కి ఎవరైనా రావొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవ్వరూ అడ్డుచెప్పరు, అలా వచ్చిన వారు మంచిగా బిర్యానీ తిని, ఇరానీ చాయ్ తాగి సంతోషంగా తిరిగెళ్లొచ్చు దానికి కూడా అభ్యంతరం లేదని అన్నారు కేటీఆర్. అదే సమయంలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు బీజేపీ సిపాయ్ లు వస్తున్నారని వారిని ఊరూరా […]
దేశాన్ని అభివృద్ధి చేయడం చేతగాని బీజేపీ, చివరకు ఫ్లెక్సీలు చించుకుంటూ కాలం గడుపుతోందని మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ లో తెలంగాణ అభివృద్ధిని చాటుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను బీజేపీ నేతలు కావాలనే చించేస్తున్నారని, వారి విధ్వంస రాజకీయాలకు ఇదో నిదర్శనం అని చెబుతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మోదీని పొగుడుతూ బీజేపీ వాళ్లు కూడా ఫ్లెక్సీలు వేసుకున్నారు. […]