BJP

తెలంగాణలో ఇంటర్నల్‌ పాలిటిక్స్‌ వేడెక్కాయి. బీజేపీ సభలతో హడావుడి పెంచితే..కాంగ్రెస్‌ కండువాల మార్పిడితో దూకుడుగా వెళుతోంది. కండువాల మార్పిడిలో కమలం వెనుకపడింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ చేరికలపై ఫోకస్‌ పెట్టింది. తెలంగాణలో కమలం నేతల హడావుడి పెరిగింది. కానీ ఆ పార్టీ వైపు చూసే నేతలు కనపడడం లేదు. ఈటల రాజేందర్ తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి భారీగా వలసలు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ నాంపల్లి బీజేపీ ఆఫీస్‌ వైపు ఎవరూ అడుగులు వేయలేదు. జిట్టా […]

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో 18 యేండ్ల తరువాత జరిగాయి. కానీ అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఎంతో తేడా ఉందని రాష్ట్రంలో తాము అధికారంలోకి రాబోతున్నామని, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయని లేని పోనీ హడావిడి సృష్టించి, లేని పోనీ భ్రమలను కల్పించి ఇక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది బీజేపీ.

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించారు. ప్రధాని మోడీ సోమవారం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆసాంతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా జి. కిషన్ రెడ్డే అన్నింటినీ దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డే అందరినీ ఆహ్వానించారు. అసలు ఎవరిని పిలవాలో కూడా డిసైడ్ చేసింది కూడా కిషన్ రెడ్డే. రాష్ట్ర […]

9 మంది లోక్ సభ సభ్యులున్న ఓ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్. దాని అధినేత కేసీఆర్. కానీ తెలంగాణలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత కేసీఆర్ ని నిజంగా ఓ ప్రాంతీయ పార్టీ అధినేతగా, కేవలం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే ప్రధాని మోదీ భావిస్తున్నారని అనుకోలేం.

హైదరాబాద్‌లో జ‌రిగిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌భలో నిర‌స‌న తెలుపుతున్న ద‌ళిత‌ ఆందోళ‌న‌కారుల‌పై బీజేపీ కార్య‌కర్త‌లు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. బీజేపీ కార్య‌కర్త‌లు ఆందోళ‌నకారుల‌ను త‌రుముతూ వెంట‌ప‌డి కొట్ట‌డం క‌నిపించింది. రాష్ట్రంలో ఎస్సీలు, ఇతర వర్గాల చిరకాల డిమాండ్ అయిన షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ఎంఆర్పీఎస్ సభ్యులు ప్లకార్డుల‌తో నిర‌స‌న తెలిపారు. ఈ ప్ర‌ద‌ర్శ‌నపై కొంద‌రు బీజేపీ కార్య‌క‌ర్త‌లు విరుచుకుప‌డి ఆందోళ‌న‌కారుల‌పై […]

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగం ఉసూరుమనిపించిందనీ, కేసీఆర్‌ పేరేత్తనందుకు బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. ఇది పాక్షిక సత్యమే! వ్యూహాత్మకంగానే మోడీ అభివృద్ధి సబ్జెక్టును ఎంపిక చేసుకొని ఉంది ఉంటారు. ఒకసారి అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్ ప్రసంగాలు వినండి. అందులో వాడి, వేడి పుష్కలంగా ఉంది. తెలంగాణలో పార్టీ జాతీయ సమావేశాలను నిర్వహించడం, భారీ బహిరంగసభ, కేసీఆర్ ను గద్దె దింపుతామంటూ పార్టీ నాయకుల ప్రతిజ్ఞలు.. అన్నీ […]

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల సంద‌ర్భంగా భీమ‌వ‌రంలో నిర్వ‌హించిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌రణ స‌భ‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రు కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. గ‌త కొంత‌కాలంగా బీజేపీ ప‌ట్ల మారిన ఆయ‌న వైఖ‌రి కార‌ణంగానే మోడీ స‌భ‌కు హాజ‌రుకాలేదా..? లేదా బీజేపీతో దూరం జ‌ర‌గాల‌నే ఆలోచ‌న‌తోనా..? లేక మ‌రేవైనా ఇత‌ర కారణాలు ఉన్నాయా..? అనే విష‌యాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. నిన్న‌టి వ‌ర‌కూ విజ‌య‌వాడ‌లోనే ఉన్న ప‌వ‌న్ నేడు హైద‌రాబాద్ వెళ్ళ‌డం వెన‌క ఆయ‌న ఆంత‌ర్యం ఏమిట‌నే […]

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ దాని కోసం అనేక ఎత్తుగడ‌లు వేస్తోంది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో జరిపించడం ద్వారా పార్టీ బలపడొచ్చని ఆ పార్టీ ఎత్తు వేసింది. పైగా ఆ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలంతా హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా ఇతర పార్టీల నుంచి నాయకులను పెద్ద ఎత్తున బీజేపీ లో […]

– ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది – 8 ఏళ్లలో రాష్ట్రానికి చాలా నిధులు ఇచ్చాం – త్వరలో మెగా టెక్స్‌టైల్ పార్క్ రాబోతోంది – రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని త్వరలోనే జాతీయం చేస్తాం – తెలుగు భాషలో మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యను అందించనున్నాం దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఎంతో అభివృద్ది చెందుతున్నాయి. అందుకు డబుల్ ఇంజిన్ సర్కార్లే కారణం. తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కారును కోరుకుంటున్నారు. అందుకు ఇక్కడి ప్రజలే […]

ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు పెట్టుకున్నారు నరేంద్రమోదీ. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ఏపీలో అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. కనీసం తమకు పోస్టర్లు వేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు బీజేపీ నేతలు. మెట్రో పిల్లర్లను కూడా కబ్జా చేశారని, బ్యానర్లలో మోదీని హేళన చేస్తున్నారని కూడా మండిపడ్డారు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీల గొడవ జరిగింది. […]