జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీ పెట్టడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ సాహసాన్ని వామపక్షాలు స్వాగతించాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. కేసీఆర్ ఆలోచనను స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అయితే రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్ స్పష్టమైన వైఖరితో ఉండాలని సూచించారు. ఎన్డీఏ వ్యతిరేక కూటమి బలంగా నిలబడాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎత్తుగడ అదిరిపోవాలి.. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఎలా అనే […]
BJP
చిల్లర రాజకీయాల కోసం దేశప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. కులం, మతం పేరిటి రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చలి మంటలను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవ్వాళ్ళ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. 11.75 కోట్ల రూపాయలతో లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ […]
తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు టీఆరెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవ్వాళ్ళ ఆరోపించారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఆయన శుక్రవారం జేబీఎస్ లో ప్రయాణీకులతో మాట్లాడారు. బస్సు ఛార్జీలు పెంచి ఆర్టీసీకి ప్రయాణీకులను దూరం చేస్తున్నారని, ఆ విధంగా మెల్లెగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారని సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్ మాటలు వింటే ఈయన ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకమని సంస్థలన్నీ ప్రభుత్వ రంగంలోనే నడవాలని […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ్ళ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్ లో జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై వారితో చర్చించనున్నారు. వచ్చే నెల 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలపైనా ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. కొంత కాలంగా కేంద్ర బీజేపీ సర్కార్ పై యుద్దం ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిదాయకంగా మారింది. నరేంద్ర మోడీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణ […]
శత్రువుకి శత్రువు మిత్రుడు.. ఈ క్రమంలో బీజేపీకి శత్రువులుగా ఉన్న టీఆర్ఎస్, వామపక్షాలు ఇప్పుడు కలవబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కి వకాల్తా పుచ్చుకున్నట్టు, తెలంగాణ గవర్నర్ ని విమర్శిస్తూ.. సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. టీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టేందుకు తెలంగాణలో బీజేపీ చాలామందిని రంగంలోకి దింపింది. కేఏపాల్ ని కూడా వెనకనుంచి దువ్వుతోంది. ఈ దశలో కేసీఆర్ కి కూడా వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరిగా మారే అవకాశముంది. అందుకే […]
తాజాగా పవన్ కల్యాణ్ పెట్టిన ఓ ట్వీట్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. జర భద్రం అంటూ ఆయన కార్యకర్తలను అలర్ట్ చేశారు. ‘అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్‌గా మనల్ని పొగడటం ప్రారంభిస్తారు. పొగడ్తలను నిజమనుకుంటే ప్రమాదంలో పడ్డట్టే.. ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల ట్రాప్ లో పడ్డట్టే’ అంటూ ఆయన ట్వీట్. దీంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సడెన్ […]
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు పేర్ని నానిపై అటాక్ మొదలు పెట్టారు. అడ్డంగా బలిశావంటూ నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా అంటూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలవి ఒళ్లు బలిసిన మాటలంటూ విరుచుకుపడ్డారు. గతంలో బీజేపీ జాతీయ నాయకులెవరూ ఏపీ ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు. […]
రాజమండ్రి నా జన్మభూమి, ఉత్తర ప్రదేశ్ నా కర్మ భూమి అంటూ బీజేపీ సభలో వ్యాఖ్యానించారు జయప్రద. ఇటీవల తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఫోకస్ పెడతానంటూ తన సన్నిహితుల దగ్గర మాట్లాడిన జయప్రద.. ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలసి బీజేపీ గోదావరి గర్జన సభకు హాజరయ్యారు. చాన్నాళ్లుగా ఆమె బీజేపీలోనే ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సభలు, సమావేశాలకు పెద్దగా హాజరు కాలేదు. ఇప్పుడు గోదావరి గర్జనతో తాను బీజేపీలోనే ఉన్నట్టు క్లారిటీ […]
ప్రధానితో కార్పొరేటర్ల భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంత పెద్ద హోదాలో ఉన్న నరేంద్ర మోడీ స్వయంగా కార్పొరేటర్లను పిలిపించుకోవడం ఏంటని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. జీహెచ్ఎంసీలో గెలిచిన 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సహా ఇతర నాయకులు ప్రధానిని కలిశారు. అయితే, ప్రధాని వారితో ప్రత్యేకంగా భేటీ కావడానికి రాబోయే ఎన్నికలే లక్ష్యమని తెలుస్తున్నది. ఇటీవల […]
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఆమ్నీషియా పబ్ రేప్ కేసులో మైనర్ బాధితురాలి వివరాలను బహిర్గతపరచడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు అయ్యింది. మీడియా మీట్ పెట్టి బాధితురాలి ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. అంతే కాకుండా నేరస్థుల వివరాలను కూడా ప్రకటించారు. అందులో కొంత మంది మైనర్లు ఉన్నారు. ఈ ఫొటోలు, వీడియోలు అవసరం అయితే డీజీపీ మహేందర్‌రెడ్డికి కూడా పంపుతానంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 228ఏ కింద కేసు నమోదు […]