బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారి పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. విజయవాడలో బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖుల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. నడ్డా హిందీ ప్రసంగాన్ని పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని నడ్డా విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్రం తెస్తే.. దాన్ని జగన్ ఆరోగ్య శ్రీగా మార్చేశారని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలో ఎక్కడైనా పనిచేస్తుందని.. ఆరోగ్య శ్రీ పథకం రాష్ట్రం […]