డ్రగ్స్ దందా వెలుగు చూశాక పుడింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్సను ఆబ్కారీ శాఖ రద్దు చేసిన వైనం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. ఈ వ్యవహారం బట్టబయలు కాగానే మూడు వర్గాలు మూడు రకాలుగా స్పందించాయి. ఎక్సైజ్ శాఖ లైసెన్స్ రద్దు చేయగా, పోలీసు శాఖ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. ఇక సెలబ్రిటీ వర్గం వింతగా స్పందించింది. సెలబ్రిటీలు తాము అమాయకులమని బుకాయించగా, సంపన్నులైన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను వెనకేసుకొచ్చారు. […]