ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోడీ తన ప్రసంగంలో పలు మార్లు ‘భాగ్యనగరం’ అని సంబోధించారు. బీజేపీ నాయకులు కూడా గత కొన్నాళ్లుగా హైదరాబాద్ పేరును కాకుండా భాగ్యనగరం అనే పిలుస్తున్నారు. మీడియాకు పంపే లెటర్ హెడ్స్‌లో కూడా హైదరాబాద్ అని ఎక్కడా కనిపించదు. విజయ సంకల్ప సభలో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మళ్లీ భాగ్యనగరంగా మారుస్తాము అని చెప్తున్నారు. అసలు ఈ నగరం పేరు హైదరాబాదా? లేదా […]