బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈరోజు నుంచి క్లాసులకు వెళ్లేందుకు సమ్మతించారు. వారం రోజులుగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు గత అర్ధరాత్రి జరిగిన చర్చలు సఫలం కావడంతో శుభం కార్డు పడింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా విద్యార్థులతో చర్చలు జరిపారు. ఒక్కొక్కటిగా సమస్యలన్నిటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు విద్యార్థులు. అర్ధరాత్రి 12.30నిముషాలకు చర్చలు పూర్తయ్యాయి. ఈరోజునుంచి విద్యార్థులంతా తరగతులకు […]