Bandi Sanjay

భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి) ‘మిష‌న్‌-7’ లో భాగంగా రాష్ట్ర‌ల్లో ఆధిప‌త్యం చాటాల‌ని ల‌క్ష్యంగా ఎన్నుకున్నా ఒక్క‌దానిలో మిన‌హా ఎక్క‌డా నేటికీ పాగా వేయ‌లేక‌పోయింది. దేశంలోనే అతి చిన్న దక్షిణాది రాష్ట్రంగా ఉన్న తెలంగాణతో పాటు ఈ “మిషన్-7″లో అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి ఏడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని 2014లోనే పార్టీ ప్లాన్ చేసింది. అయితే అస్సాం మినహా ఈ అన్ని రాష్ట్రాల్లో దాని పాచిక పార‌లేదు. హైదరాబాద్‌లో వ‌చ్చేనెల […]

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్మీ ఉద్యోగాల కోసం రెండేళ్ల నుంచి సిద్ధ‌మ‌వుతున్న వారికి కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్ ఒక్కసారిగా ఆశలు చిదిమేసింది. దీంతో శుక్రవారం దాదాపు వెయ్యి మంది ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో రైలు బోగీలకు నిప్పంటించడం, పార్సిళ్లను దగ్ధం చేయడం వంటి ఘటనలు జరిగాయి. అంతే కాకుండా వీరిని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను […]

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాగోలు పరిధి బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభ నిర్వహించారు. ఆ సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఒక స్కిట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసు విషయంలో ఇప్పటికే బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాతా ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పుడు అదే కేసులో బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు […]

బండి సంజయ్ పై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై బండి సంజయ్, కేటీఆర్ పై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఆయన పరువుకి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ సభల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలేంటీ వివాదం.. ఆమధ్య ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కేటీఆర్ ని కార్నర్ చేసేలా బండి […]

తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు టీఆరెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవ్వాళ్ళ ఆరోపించారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఆయన శుక్రవారం జేబీఎస్ లో ప్రయాణీకులతో మాట్లాడారు. బస్సు ఛార్జీలు పెంచి ఆర్టీసీకి ప్రయాణీకులను దూరం చేస్తున్నారని, ఆ విధంగా మెల్లెగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారని సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్ మాటలు వింటే ఈయన ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకమని సంస్థలన్నీ ప్రభుత్వ రంగంలోనే నడవాలని […]