వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై టీడీపీ, జనసేన నేతలే కాకుండా వైసీపీకి చెందిన ఒక ముఖ్యనేత కూడా కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేనిపై కుట్రలు మానుకోవాలని టీడీపీ, జనసేన నేతలకు సూచించారు. మూడు జిల్లాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు కూడా కుట్రలకు దిగడం విచారకరమన్నారు. […]