అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీగోడను అక్కడి మున్సిపల్ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడి కుమారుడి పేరు మీద ఈ ఇల్లు ఉంది. అయితే అయ్యన్న కుటుంబసభ్యులు నీటిపారుదల శాఖకు చెందిన రెండు సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని ప్రహరీ గోడను నిర్మించుకున్నారని.. అందుకే తాము ఈ ఇంటిని కూల్చివేశామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతను మొదలుపెట్టామని వారు చెప్పారు. ఇదిలా ఉంటే అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ […]