ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అతి భారీ విజయాన్నే సాధించింది. ఓటింగ్ శాతం తగ్గడంతో మెజారిటీపై ప్రభావం పడుతుందని భావించారు. అయినప్పటికీ అతి భారీ విజయాన్నే మేకపాటి విక్రమ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఇక్కడా డిపాజిట్లు వదిలేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి 20వేల ఓట్లను కూడా సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. వైసీపీకి ఉద్యోగులు ఈసారి వ్యతిరేకంగా పనిచేశారని కౌంటింగ్ ప్రారంభం సమయంలో కొందరు వైసీపీ నేతలు మీడియా వద్ద వ్యాఖ్యలు చేశారు. […]