atmakur

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అతి భారీ విజయాన్నే సాధించింది. ఓటింగ్‌ శాతం తగ్గడంతో మెజారిటీపై ప్రభావం పడుతుందని భావించారు. అయినప్పటికీ అతి భారీ విజయాన్నే మేకపాటి విక్రమ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఇక్కడా డిపాజిట్లు వదిలేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి 20వేల ఓట్లను కూడా సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. వైసీపీకి ఉద్యోగులు ఈసారి వ్యతిరేకంగా పనిచేశారని కౌంటింగ్ ప్రారంభం సమయంలో కొందరు వైసీపీ నేతలు మీడియా వద్ద వ్యాఖ్యలు చేశారు. […]

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజారిటీ దిశగా వైసీపీ వెళ్తోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్థి మైకపాటి విక్రమ్‌ రెడ్డి 32వేల 892 ఓట్ల మెజారిటీ సాధించారు. బీజేపీ అభ్యర్థి భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తొలి రౌండ్ నుంచే వైసీపీ హవా నడుస్తోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి.. వైసీపీ అభ్యర్థికి మొత్తం 40వేల 377 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 7485 ఓట్లు వచ్చాయి. ఆఖరి రౌండ్లలో […]

ఆత్మకూరు ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి విక్రమ్‌ రెడ్డితో పాటు ఎనిమిది మంది నామినేషన్‌ వేశారు. బై పోల్‌కు దూరం అని టీడీపీ ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో లక్ష ఓట్ల మెజార్టీని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి నేతృత్వంలో వ్యూహా రచన చేస్తోంది. ఆత్మకూరులో మొత్తం 2 లక్షల 33 వేల 330 మంది ఓటర్లు. […]