Arugunu Nenu

వీధిఅరుగునునేనుపరుగులలోకంలోకరిగికరిగి మరుగునపడిపోయానుకనుమరుగైపోయానుఅంతస్తుల మోజులోఅడుగునపడిపోయానుఅసలునేనూ..ఊరుమ్మడిచుట్టాన్నిఊరుమంచి కోరేదాన్నిఊరడింపునిచ్చేదాన్నిఊసులాలకించేదాన్నిఊ..కొట్టేదాన్నిఊళ్ళోకొచ్చినదెవరైనాకూర్చోమంటూనేకుశలమడిగేదాన్నిపొరుగింటిముచ్చట్లైనా…ఇరుగింటి అగచాట్లయినా ఇంటింటి రామాయణాన్నిఇట్టే కనిపెట్టేదాన్నినేర్పుగ,ఓర్పుగతగవులుతీర్చేదాన్నితగినతీర్పులూ..ఇచ్చేదాన్నిఎవరిబాధలెన్నైనా..ఏ వేదనలున్నా ఓర్పుగా ..ఆలకించిఓదార్పునందించేదాన్నినేనెరుగని కధలేదునన్నెరుగని గడపలేదునాతోగడపనిదెవరూ..నాతోపనిపడనిదెవరికని?అందరినీ..అక్కునచేర్చుకులాలించేదాన్నిపాలించేదాన్నిఆత్మీయతపంచేదాన్నిఅందరినీ ఆదరించిచేరదీసి,సేదదీర్చేదాన్నిఅసలునేనూ..అచ్ఛం అమ్మలాంటిదాన్నిఅసలుసిసలుమానవసంబంధాలకుపట్టుగొమ్మలాంటిదాన్నిఎవరూ..పదిలంచేయనిపాతబంగారాన్నిరాతినేగాని,ఆపాతమధురాన్నినావిలువను,గుర్తించలేనిమీకై..నిన్నటి మీ జ్ఞాపకంగా మిగిలిపోతున్నా…ఉరుకులపరుగులతోఉక్కిరిబిక్కిరవుతున్ననా బిడ్డల జీవనగమనం…