ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ దాదాపు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసీకి గనుల కేటాయింపు, మెడికల్ కాలేజీలు తదితర అంశాలపై ఆయన ప్రధానితో చర్చించారు. ఈమేరకు వినతిపత్రాన్ని కూడా అందించారు. రెవెన్యూ గ్యాప్ ఇప్పించండి.. 2014–15కు సంబంధించిన పెండింగ్ బిల్లుల రూపంలో కేంద్రం ఏపీకి బకాయిలు పడింది. 10వ వేతన సంఘం బకాయిలు, డిస్కంల […]
AP
విశాఖ జిల్లాలో ఒక కొండ కుప్పకూలింది. ఈ దృశ్యాలను చూసి స్థానికులు పరుగులు పెట్టారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో కొండ కుప్పకూలింది. కొంతకాలంగా ఈ కొండ వద్ద క్వారీయింగ్ జరుగుతోంది. చుట్టూ భారీగా తవ్వడంతో కొండ పట్టుకోల్పోయింది. కొండ శిఖరం నుంచి చెట్లు, రాళ్లు మొత్తం పెద్ద శబ్ధంతో కిందకు కూలిపోయాయి. కొండ ఈ తరహాలో కూలిపోవడానికి అక్రమ మైనింగే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్ చాలాకాలం పాటు గతంలో కొనసాగింది. కొద్ది రోజుల క్రితమే […]
సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతి, అక్రమాలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూసుకుంటున్నారు. నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోనే డబ్బులు పడిపోతున్నాయి. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కొన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచాలకు అలవాటు పడ్డ కొన్ని శాఖల ఉద్యోగులు తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు సీఎం జగన్ నడుం బిగించారు. ఇందులో భాగంగా అవినీతిపై […]
ఆహారపు అలవాట్లు, ప్రజల జీవన శైలి మార్పుతో 60, 70 ఏళ్ల వయసులో రావాల్సిన రోగాలన్నీ ముందుగానే చుట్టుముడుతున్నాయి. 40 ఏళ్లకే బీపీ, షుగర్.. 50 దాటితే వృద్ధాప్యం.. ఇదీ నేటి పరిస్థితి. అందుకే రాజకీయ పార్టీలు కూడా 50 దాటితే వృద్ధాప్యపు పింఛన్ ఇస్తామంటూ ప్రజలకు ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే షుగర్, బీపీ వంటి వాటిని ముందస్తుగా గుర్తించి వైద్యం మొదలు పెడితే.. వాటి వల్ల వచ్చే ముప్పుని వాయిదా వేసుకోవచ్చని చెబుతుంటారు వైద్య నిపుణులు. […]
దావోస్ పర్యటన వివరాలను వెల్లడించిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. అక్కడ తమకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. దావోసు సదస్సులో ఒక సంస్థ ప్రతినిధి .. వదరలొస్తే విశాఖపట్నం మునిగిపోతుందట కదా అని ప్రశ్నించారని అమర్‌నాథ్ చెప్పారు. ఆ మాటతో తనకు చాలా బాధేసిందన్నారు. తన కళ్లలో నీరు తిరిగాయన్నారు. విశాఖపట్నం మునిగిపోతుందంటూ ఒక వర్గం మీడియా చేసిన ప్రచారం కారణంగానే ఈ ప్రశ్న ఎదురైందన్నారు. విశాఖ మునిగిపోతుందంటూ నగర ఇమేజ్‌ను దెబ్బతీశారని మంత్రి విమర్శించారు. ప్రతిపక్ష పార్టీకి మేలు […]
ఏపీ జలవనరుల శాఖ టెండర్ల డాక్యుమెంట్లలో ఒక నిబంధనను చేర్చింది. ప్రస్తుతం ఏపీలో భారీగా పెండింగ్ బిల్లులున్నాయి. వాటి చెల్లింపులో తీవ్ర జాప్యం అవుతోంది. దీంతో పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టు వెళ్లి.. బిల్లుల చెల్లింపునకు ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. బిల్లుల చెల్లింపునకు హైకోర్టు డెడ్‌లైన్లు కూడా పెడుతుండడంతో ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అధికారులకు కోర్టు నుంచి ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో ముందు జాగ్రత్తగా జలవనరుల శాఖ స్పెషల్ కండిషన్ ఆఫ్ నోట్ పేరుతో ఒక నిబంధనను చేర్చింది. ప్రభుత్వం […]
పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో లోక్ సభ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ అనే వార్తలు రావడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత లభించింది. అయితే ఇదివరకే దీనిపై కేంద్రం స్పష్టతనివ్వగా.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మరోసారి సమాధానం రూపంలో నియోజకవర్గాల పునర్విభజనపై క్లారిటీ వచ్చింది. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని భావించారంతా. […]