AP Minister

పేదలు చదువుకుంటే చంద్రబాబుకి మనసొప్పదని, అందుకే ఆయన అన్ని పథకాలకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారాయన. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం బైజూస్ తో ఒప్పందం చేసుకుంటే.. బాబుకి కడుపుమంట ఎందుకని నిలదీశారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను ఆయన చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్‌’ను ప్రభుత్వ […]

ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడే జోగి రమేశ్ .. ఈసారి నేరుగా ఓ పత్రికాధిపతినే టార్గెట్ చేశాడు. ఏకంగా రామోజీరావునూ విమర్శించారు. రాష్ట్రంలోని రెండు పత్రికల్లో నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. విషయం ఏమీ లేకపోయినా.. చిన్న అంశాలను కూడా పెద్దవిగా చేసి బ్యానర్ స్టోరీలుగా వండి వారుస్తున్నారు. ఇదిలా ఉంటే ‘పునాది దాటని పేదిళ్లు’ అంటూ ఈనాడు పత్రిక ఓ కథనం రాసింది. పేదలకు సొంతిళ్లు కట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేదని.. […]

పవన్ కల్యాణ్ టార్గెట్‌గా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఒక ట్వీట్ చేశారు. పొత్తులపై ఇచ్చిన ఆప్షన్లను ఎద్దేవా చేస్తూ పెట్టిన ఆ ట్వీట్‌ను ఆ తర్వాత ఉమా డిలీట్ చేశారు. తాజాగా ఆ విషయంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దేవినేని ఉమా పెట్టిన ట్వీట్ ఎందుకు తొలగించావ‌ని.. ధైర్యం ఉంటే ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావో చెప్పు అంటూ సవాల్ విసిరారు. దేవినేని ఉమా సదరు ట్వీట్‌లో పవన్ టార్గెట్‌గా […]