ఏపీలో ఆరోగ్య శ్రీ కార్డులపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో లేకపోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అభ్యంతరం తెలిపారు. విజయవాడలో పర్యటించిన ఆమె.. ప్రభుత్వ ఆస్పత్రికి సందర్శించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బోర్డులపై వైఎస్‌ఆర్, జగన్ ఫోటోలు మాత్రమే ఉండడంతో ప్రధాని మోడీ ఫోటో ఎక్కడని ప్రశ్నించారు. ఆయూష్మాన్ భారత్‌కు సంబంధించిన లోగోను గోడపై ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ […]