Ap government

ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణలో బీజేపీ నేతలంతా టీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తే, మోదీ మాత్రం ఆ జోలికి పోలేదు. దీంతో కాంగ్రెస్ కి కోపమొచ్చింది. టీఆర్ఎస్ పై మోదీ ప్రేమ చాటుకున్నారని, మోదీ-కేసీఆర్ మధ్య స్నేహానికి ఇదే నిదర్శనం అని కొత్త లాజిక్ తీశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇక ఏపీ విషయానికొద్దాం.. ఏపీలో కూడా మోదీ ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ […]

ఏపీలోని గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం నెలకు 5వేల రూపాయలు. అది తమకు ఏమాత్రం సరిపోదని, దాన్ని పెంచాలంటూ గతంలో వలంటీర్లంతా రోడ్డెక్కారు, ఆందోళనకు సిద్ధపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం వేతనం పెంచలేదు. వలంటీర్ పోస్ట్ అనేది ఉద్యోగం కాదని, కేవలం ప్రజలకు చేసే సేవ అని, అందుకు గౌరవ వేతనంగా 5వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పింది. ఆ తర్వాత వలంటీర్లలో ఉన్న అసంతృప్తి చల్లార్చేందుకు వారికి ప్రతి ఏటా పురస్కారాలు అందిస్తున్నట్టు […]

అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో నిధులు సమీకరించుకునేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో రాజధాని పరిధిలోని 248 ఎకరాలను విక్రయించేందుకు వేలం వేయనున్నారు. భూముల అమ్మకానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, భూములు అమ్మి అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబే స్వయంగా చెప్పడం, హైకోర్టు అభివృద్ధికి ఆదేశించడంతో ప్రభుత్వం ఆ భూములనే అమ్ముతోంది. విడతల వారీగా 600 ఎకరాలను అమ్మాలని […]

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పిరియడ్ పూర్తిచేసుకొని, డిపార్ట్‌మెంటల్ పరీక్ష కూడా పాస్ అయిన వారికి ఈ జీవో ప్రకారం జీతాలు అందనున్నాయి. జీవో నెంబర్ 5 ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేసే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఈ జీవోకు సంబంధించిన ఉత్తర్వుల జారీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా రోజుల […]

అల్లూరి సీతారామరాజు 125వ‌ జయంతి సందర్బంగా నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఏపీ వస్తున్న సమయంలో తనను అరెస్ట్‌ చేయడం లాంటి చిల్లర వేషాలు వేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ప్రధాని మోడీ అల్లూరికి నివాళులర్పించే ఏర్పాటు చేసిన కార్యక్రమం తన సొంత ఊరిలో, తన ఇంటికి 300 మీటర్ల దూరంలో జరుగుతుందని రఘురామ చెప్పారు. అలాంటి కార్యక్రమంలో స్థానిక ఎంపీగా పాల్గొనే హక్కు తనకుందన్నారు. కేసులు పెట్టాలనుకుంటే ముందే పెట్టాలని.. వాటిపై తాను కోర్టుకు […]

ఏపీలో ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లా ఎస్పీగా ఉన్న సుబ్బారెడ్డిని మంగళగిరిలోని ఆరో బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేశారు. కోనసీమకు కొత్త ఎస్పీగా సిహెచ్.సుధీర్ కుమార్ రెడ్డిని నియమించారు. ఆయన ఇప్పటి వరకు కర్నూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. సుధీర్ కుమార్ రెడ్డి స్థానంలో కర్నూలు జిల్లాకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ని కృష్ణా జిల్లా నుంచి బదిలీ చేశారు. కౌశల్ స్థానంలో కృష్ణా జిల్లాకు […]

ఏపీ ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన ఎడ్యుకేషనల్‌ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. సీఎం సమక్షంలో కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. బైజూస్ వ్యవస్థాపకుడు రవీందర్‌ అమెరికా నుంచి వర్చువల్‌ విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్‌తో విద్యను అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో పిల్లలు పోటీ పడేలా సన్నద్దం […]

అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు చేస్తున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరిగింది. దీని వెనక టీడీపీ నేతలు, వారి అనుచరులు, ఐటీడీపీ యాక్టివిస్ట్ లు ఉన్నట్టు నిర్థారించారు పోలీసులు. దీంతో వారందరికీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నలుగురిని సీఐడీ పోలీసులు విచారణకోసం గుంటూరు కార్యాలయానికి పిలిపించడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. సీఐడీ విచారణ నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపులంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. […]