టీమ్ ఇండియా మహిళా జట్టు వన్డే, టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్ 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన వీడ్కోలుకు సంబంధించి ఒక సుదీర్ఘ ప్రకటనను సోషల్ మీడియాలో పెట్టడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కోవిడ్‌కు ముందే తాను న్యూజిలాండ్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ అనంతరం క్రికెట్ నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన […]