దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పెద్దల విధానాలు మారకుంటే వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరిగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ప్లీనరీలో మాట్లాడిన వేణుగోపాల్.. కార్యకర్తలు కూడా బయటకు రావడం లేదన్నారు. కార్యకర్తలకు రావాల్సిన బిల్లులే ఇప్పించలేదు.. మళ్లీ మీరు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే వాపోయారు. తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో ప్రతి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయల పనులు కేటాయించారని.. తాను అత్యుత్సాహంతో పార్టీ […]
Andhra Pradesh
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 98 డీఎస్సీ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారాయి. ఇక ఉద్యోగం రాదని భావించి.. వివిధ వృత్తుల్లో స్థిరపడ్డ అభ్యర్థులు సీఎం జగన్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అందరూ కలిసి వెళ్లి సీఎం జగన్ కు కృతజ్జతలు తెలిపారు. కాగా 98 డీఎస్సీ అభ్యర్థులపై తాజాగా బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం చీపురుపల్లిలో […]
ఏపీలో రాజకీయ పరిణామాలు ఆనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. అప్పుడే రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. వైసీసీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం ఖాయమే. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఎలాంటి పొత్తులు ఉంటాయనేది తేలడం లేదు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని వెళ్తే.. తప్పకుండా మంచి పాజిటివ్ వేవ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇటీవల ఇరు పార్టీల అధినేతలు కూడా ఈ పొత్తు విషయంలో సరైన క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. అందుకు ప్రధాన కారణం […]
ఏపీలో అమ్ముతున్న లిక్కర్ లో విష పదార్థాలు ఉన్నాయంటూ ఇటీవల టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి అంబటి రాంబాబు ఇదివరకే దీటుగా బదులిచ్చారు. టీడీపీ నేతల మెదళ్లే విషపూరితంగా మారాయని విమర్శించారు అంబటి. గతంలో చంద్రబాబు అనుమతి ఇచ్చిన డిస్టిలరీలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని, అప్పటి అమృతం ఇప్పుడు విషమైపోయిందా అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఏపీ లిక్కర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. డిస్టిలరీలు సరఫరా చేసే […]
ఏపీ ప్రభుత్వం తనపై రెండోసారి సస్పెన్షన్ వేటు వేయడం పట్ల సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే అంశంపై ప్రభుత్వం రెండుసార్లు ఎలా చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు న్యాయ సమీక్షలో చెల్లుబాటు కావు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేసినట్లు మీడియాలో వచ్చిందని.. తనకైతే ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదన్నారు. తనపై ఇప్పటివరకు చార్జిషీట్ కూడా […]
షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ అనే పార్టీ పెట్టిన తర్వాత విజయమ్మ దాదాపుగా కుమార్తెతోపాటే ఉంటున్నారు. జగన్ తో విభేదాలున్నాయనే పుకార్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ నాయకులు ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపారేస్తున్నా.. ఇటీవల కాలంలో జగన్, విజయమ్మ కలసి కనిపించిన సందర్భాలు అరుదు. అయితే ఈ అపోహలకు చెక్ పెడుతూ ఇప్పుడు విజయమ్మ వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలో జరిగే వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ […]
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు నడిచాయి. ఇటు ప్రభుత్వం, అటు బుక్ మై షో మధ్య గట్టిగా వాదనలు నడిచాయి. ప్రేక్షకులను బుక్ మై షో లాంటి సంస్థలు దోచేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించగా.. ప్రభుత్వం గుత్తాధిపత్యానికి తెరలేపుతోందని బుక్ మై షో ఆరోపించింది. ప్రభుత్వం తెస్తున్న పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలన్న నిబంధనను బుక్ మై షో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నేరుగా తనకు తాను ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తే […]
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలనుంచి సడన్ గా 800కోట్ల రూపాయలు మాయం అయ్యాయి. 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలనుంచి ఈ నగదు విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు జీపీఎఫ్ స్లిప్ లు డౌన్ లోడ్ చేసి చూసుకుని షాకయ్యారు. కొంతమంది ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్ నుంచి దాదాపు 80వేల రూపాయలు కూడా విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. జీపీఎఫ్ ఖాతాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే అయినా.. గతంలో ఎప్పుడూ ఇలా విత్ డ్రా […]
తెలుగుదేశం పార్టీ ఇటీవలే ఒంగోలులో మహానాడును భారీ ఎత్తున నిర్వహించింది. అధికార వైసీపీపై మరింత దూకుడుగా వెళ్లాలని అధినేత చంద్రబాబు ఆ సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కానీ, మహానాడు పూర్తయిన తర్వాత కొంత మంది టీడీపీ నేతలు గడప కూడా దాటలేదు. మరోవైపు ‘గడప గడపకు’ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపి తిరిగి పుంజుకోలేక పోతుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని ఆరోపించారు. ‘జగన్‌ను దించేస్తా.. నేను సీఎం అవుతా అంటూ చంద్రబాబు సవాళ్లు విసిరాడు. కానీ ఇప్పుడు దిగజారిపోయి .. గుడివాడలో కొడాలిని ఓడిస్తాననే స్థాయికి దిగజారాడు. ముందుకు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్థితి చూసుకోవాలి. ఇప్పటికే అక్కడ పునాదులు కదిలాయి. అది మరిచిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇక కొడాలి నాని పరిస్థితి గతంలోలా ఇప్పుడు లేదు. […]