Andhra Pradesh

పదో తరగతి పరీక్ష ఫలితాల శాతం తగ్గిపోవడాన్ని ఏపీలో విపక్షాలు రాజకీయ కోణంలోకి తీసుకొచ్చాయి. నాడు-నేడు విఫలమైందంటూ టీడీపీ మాట్లాడుతోంది. ఈ విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. అసలు పరీక్షలతో సంబంధం లేకుండా అందరినీ పాస్‌ చేయాలని టీడీపీ చెప్పదలుచుకుందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థలు క్యాన్సర్‌లా పట్టుకుని.. ప్రభుత్వాన్ని ఆడిస్తూ పరీక్షలకు అర్థం లేకుండా చేశాయన్నారు. బిట్‌ పేపర్ అడ్డం పెట్టుకుని కాపీయింగ్‌ ప్రోత్సహించారని ఆరోపించారు. […]

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పచ్చి అబద్దాలు చెప్పేందుకు ఢిల్లీ నుంచి ఎగేసుకువచ్చారని విమర్శించారు. రాజమండ్రికి కూతవేటు దూరంలో ఉన్న పోలవరం గురించి ఎందుకు మాట్లాడడం లేదు..?, ఆ ప్రాజెక్టుకు నిధులు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీకి 8 లక్షల కోట్ల అప్పు ఉందంటున్నారని.. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతూ రాష్ట్ర అప్పు ఎంత ఉందో తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో బీజేపీ […]

రాష్ట్రంలోని రైతులకు ప్రతి దశలోనూ తోడుగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేయడం దగ్గర నుంచి.. వారు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం వరకు ప్రభుత్వం తోడుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసిందని చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లాలో చుట్టుగుంట కూడలి వద్ద వైఎస్‌ఆర్​ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం యంత్రాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3,800 ట్రాక్టర్లు, […]

టీడీపీ ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా ఆయన బాబాయి నాగయ్య ఆందోళనకు దిగారు. నాని తన ఆస్తులు కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని నాగయ్య ఆరోపిస్తున్నారు. కేశినేని కార్యాలయం పక్కనే నాగయ్య స్థలం ఉంది. అక్కడ ఇంటి నిర్మాణాన్ని నాగయ్య మొదలు పెట్టారు. ఆ స్థలంపై కన్నేసిన కేశినేని నాని దాన్ని కాజేసేందుకు ఎత్తులు వేశారని నాగయ్య చెబుతున్నారు. తన ఇంటి నిర్మాణం అక్రమమంటూ కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసి నోటీసులు ఇప్పించారని చెబుతున్నారు. కేశినేని నాని దుర్మార్గంగా […]

శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణం (SRIVANI) ట్రస్ట్ పై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. ట్రస్ట్ కి వచ్చే విరాళాల సొమ్ము పక్కదారి పడుతోందంటూ.. ఇష్టం వచ్చినట్టు ఫేక్ పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే ట్రస్ట్ విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలను సహించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారం చేసినవారిపై కేసులు పెడతామని హెచ్చరించింది. ఈమేరకు ఓ లేఖను విడుదల చేశారు అధికారులు. మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల […]

వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్త పోస్ట్ కి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మెత్తబడ్డారు. అధిష్టానం ఆయనను బుజ్జగించడంతో రాజీనామా వెనక్కు తీసుకున్నారు. దీంతో వైసీపీలో విశాఖ సంక్షోభం ముగిసిపోయినట్టే అనుకోవాలి. వాసుపల్లి రాజీనామా అనంతరం వెంటనే అధిష్టానం రంగంలోకి దిగడం, నష్టనివారణ చర్యలు చేపట్టడం, ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడటంతో సమస్య పెద్దది కాకముందే పరిష్కారం లభించింది. వాసుపల్లి లేఖ సారాంశం.. “ప్రజా నేతగా, ప్రజల కష్టాలనే పరమావధిగా భావించే మీరు, మరోసారి […]

ఏపీలో పర్యటిస్తున్న బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆశ్చర్యపరిచాయి. ‘మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ అనే పథకానికే ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో అమలు చేస్తోంది’ అని అన్నారు. మోడీ పథకాన్నే జగన్ కాపీ కొట్టారంటూ వ్యాఖ్యానించారు. జేపీ నడ్డా మాటలు విన్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది నడ్డా అమాయకత్వమా? లేదా కావాలనే అన్నారా అనేది ఆ పార్టీ నేతలు కూడా […]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పవన్.. పార్టీలోని కీలక నేతలతో చర్చలు జరుపనున్నారు. ఇక శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. ఇందులో పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. మొదటి నుంచి అధికార వైఎస్ఆర్ సీపీనే లక్ష్యంగా పవన్ సభలు, సమావేశాలు ఉంటున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అన్ని పార్టీలను ఏకతాటిపైకి […]

ఆంధ్రప్రదేశ్ థర్మల్ విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ, చెట్టినాడు సంస్థలు దక్కించుకున్నాయి. ఒప్పందం ప్రకారం అదానీ సంస్థ 18 లక్షల టన్నులు, చెట్టినాడు సంస్థ 13 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తాయి. టెండర్లలో ఈ రెండు సంస్థలు మాత్రమే బిడ్‌ దాఖలు చేశాయి. అదానీ సంస్థ సరఫరా చేసే బొగ్గును టన్నుకు రూ. 24,500, చెట్టినాడు సరఫరా చేసే బొగ్గుకు 19,500 రూపాయలను చెల్లించి ఏపీ జెన్‌కో కొనుగోలు చేస్తుంది. ఏడాదిలో […]