Andhra Pradesh

నటుడు మోహన్‌బాబు ర్యాలీగా కోర్టుకు హాజరవ్వ‌డం చర్చనీయాంశమైంది. 2019 మార్చి 22న అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడం లేదంటూ మోహన్‌బాబు విద్యార్థులతో కలిసి మదనపల్లి హైవేపై ధర్నా చేశారు. నాటి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దాంతో మోహన్‌బాబుపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద కేసు నమోదు అయింది. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించారన్న అభియోగాన్ని మోపారు. ఈ కేసులోనే తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు వచ్చారు. అయితే నేరుగా […]

రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, వాలంటీర్ పోస్టులు వైసీపీ వాళ్ళకే ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి, వైసీపీ నాయకురాలు తానేటి వనిత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని, అది నిజంకాదని చెప్పిన ఆమె పోస్టులన్నీ మన పార్టీ వాళ్ళకే ఇస్తున్నాం కదా ! ఇంకేం చేయాలి ? అని  ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రతి […]

2024 ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఆ మధ్య మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ మాట మార్చిన సంగతి తెలిసిందే. జనసేనకు ఈసారి అధికారం ఇవ్వండి, మార్పు ఎలా ఉంటుందో చూపిస్తామంటూ పవన్ పదే పదే తన ప్రసంగాల్లో పేర్కొంటున్నారు. కనీసం బీజేపీ ప్రస్తావన కూడా ఆయన తేవడంలేదు. ఇప్పుడు బీజేపీ కూడా అదే రూట్లో ప్రచారం మొదలు పెట్టింది. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనంటున్నారు […]

రండి.. ఇప్పుడే తేల్చుకుందామంటూ టీడీపీ, బీజేపీ నేతలకు ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. ధర్మవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో మాట్లాడిన ఎమ్మెల్యే.. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. ”అధికారంలోకి వస్తే అక్రమాలను తేలుస్తా అంటున్నావ్.. ఎప్పుడు వస్తావ్, రంగంలోకి ఎప్పుడు దిగుతావో చెప్పు.. కాళ్లు చేతులు విరుస్తామని […]

వైసీపీలో అలకలు, అసంతృప్తులు క్రమక్రమంగా బయటపడుతున్నాయి. ఇటీవల రాజ్యసభ సీటు ఆశించి అది రాకపోవడంతో కాస్త అసంతృప్తికి లోనయ్యారు కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం నేత కిల్లి కృపారాణి. తాజాగా సీఎం పర్యటన సందర్భంగా ఆమె మరోసారి అలిగారు. ప్రొటోకాల్ లో తన పేరు ఉన్నా కూడా తనకు వాహనం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగానని, తనని కలెక్టర్ గుర్తించకపోవడం ఏంటని మండిపడ్డారు. స్థానిక నాయకులపై కూడా ఆమె ఆగ్రహం […]

తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇకపై భారత్ రాష్ట్ర సమితి గా మారుతోందన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. బీఆర్ఎస్ కోసం అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతో పాటు రాష్ట్రాల ప్రతినిధులను ముందుగా నియమించాలనే అంశంపై పార్టీ ముఖ్యనేతలతో ప్రగతి భవన్‌ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కూడా హాజరయ్యారు. ఇదే నెలలో కొత్త పార్టీపై ప్రకటన ఉంటుంది. దీనికోసం ఈనెల 19న జరిగే […]

తిరుమల శ్రీవారి దర్శనానికి ఇటీవల గరిష్టంగా 48 గంటలు సమయం పట్టిందని భక్తులు కంగారుపడిపోయారు. ముందుగా ప్రయాణాలు పెట్టుకున్నవారు కూడా హడలిపోయారు. అలాంటిది ఇప్పుడు గంటన్నరలోపే శ్రీవారి సర్వదర్శనం పూర్తవుతుందని హామీ ఇస్తున్నారు ఈవో ధర్మారెడ్డి. అసలిది సాధ్యమయ్యేపనేనా..? కంపార్ట్ మెంట్లలో గంటలతరబడి వేచి చూడటాన్ని ఎలా నివారిస్తారు..? అసలేంటి టీటీడీ స్ట్రాటజీ..!! శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే కొవిడ్ కారణంగా రెండేళ్లుగా పూర్తి స్థాయిలో దర్శనాలకు అవకాశం లేదు. టోకెన్ల […]

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు పేర్ని నానిపై అటాక్ మొదలు పెట్టారు. అడ్డంగా బలిశావంటూ నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా అంటూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలవి ఒళ్లు బలిసిన మాటలంటూ విరుచుకుపడ్డారు. గతంలో బీజేపీ జాతీయ నాయకులెవరూ ఏపీ ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు. […]

‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనేది నిరంతర కార్యక్రమమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గడప గడపకు మనం కార్యక్రమంపై బుధవారం ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో మనమే గెలవాలి. ఇదే మన టార్గెట్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామని ఊహించామా? కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోగలమనుకున్నామా? కానీ ప్రణాళికా బద్ధంగా పనిచేశాం. అందుకే గెలుపు సాధ్యమైంది. వచ్చే […]

ఏపీలో టెన్త్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. 67.26 శాతం మంది పాస్ అయ్యారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి విద్యార్థులు పరీక్ష తప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నెల రోజుల్లోపు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే, కాకుండా వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తాజాగా […]