మహ్మద్ ప్రవక్త పై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అమెరికా ఆలస్యంగా స్పందించింది. నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. బీజేపీ కూడా వారి వ్యాఖ్యలను ఖండించినందుకు సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు. “మేము మతమూ, విశ్వాసాల స్వేచ్ఛ గురించి, మానవ హక్కుల విషయంపై సీనియర్ స్థాయిలలో భారత ప్రభుత్వంతో క్రమం తప్పకుండా చర్చలు జరుపుతూ ఉంటాము. మానవ […]