తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష కోసం ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ. అమెరికా న్యూజెర్సీలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసంగించిన సీజేఐ.. తెలుగుభాష అనేక అటుపోట్లను తట్టుకుని నిలబడిందన్నారు. మారుతున్న పరిస్థితుల్లో తెలుగుతో పాటు ఇతర భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అప్పుడే ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో కలిసి జీవించడం సాధ్యమవుతుందన్నారు. […]