Adani

లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని వెంటనే అరెస్ట్‌ చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత, రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్‌లో మొదటి పర్యటన జరిగిన రెండు నెలల తర్వాత ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా అదానీకి చెందిన జార్ఖండ్ లోని గొడ్డ పవర్ ప్లాంట్ నుంచి బంగ్లా దేశ్ కు విద్యుత్తు సప్లై జరుగుతుంది. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన విద్యుత్తు మొత్తాన్ని బంగ్లాదేశ్ 25 సంవత్సరాలపాటు కొనుగోలు చేయాల్సిందే.

గౌతమ్ అదానీ హిండెన్ బర్గ్ సంస్థను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు అమెరిలోని అత్యంత ఖరీదైన న్యాయ సంస్థలలో ఒకటైన వాచ్ టెల్ సంస్థను నియమించుకుంది. ఇది తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని అదానీ భావిస్తున్నారు.

పలు అంతర్జాతీయ స్టాక్‌ సూచీలను, వివిధ దేశాల స్టాక్‌ సూచీలను రూపొందించి, నిర్వహించే ఎస్‌అండ్‌పీ డో జోన్స్‌, అదానీ గ్రూప్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది. డో జోన్స్‌ సైస్టెన్‌బిలిటీ ఇండెక్స్‌ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.ఇది ఫిబ్రవరి 7 నుండి అమలులోకి వస్తుంది.

ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అధ్యక్షభవనాన్నే ఆక్రమించుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాని విక్రమ సింఘే కూడా రాజీనామా చేశారు. అయినప్పటికీ అక్కడ ప్రజల నిరసనలు ఆగడంలేదు. అక్కడి నిరసనకారులు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మిత్రుడు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మీద కూడా నిప్పులు చెరుగుతున్నారు. తమ దేశాన్ని సర్వనాశనం చేసిన తమ నాయకులను తమ చెప్పుచేతుల్లో […]

ఆంధ్రప్రదేశ్ థర్మల్ విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ, చెట్టినాడు సంస్థలు దక్కించుకున్నాయి. ఒప్పందం ప్రకారం అదానీ సంస్థ 18 లక్షల టన్నులు, చెట్టినాడు సంస్థ 13 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తాయి. టెండర్లలో ఈ రెండు సంస్థలు మాత్రమే బిడ్‌ దాఖలు చేశాయి. అదానీ సంస్థ సరఫరా చేసే బొగ్గును టన్నుకు రూ. 24,500, చెట్టినాడు సరఫరా చేసే బొగ్గుకు 19,500 రూపాయలను చెల్లించి ఏపీ జెన్‌కో కొనుగోలు చేస్తుంది. ఏడాదిలో […]