తెలంగాణ బీజేపీ నేత ఎ. చంద్రశేఖర్ సీఎం కేసీఆర్‌పై కొన్ని ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. చంద్రబాబును సీఎం పదవి నుంచి దించేందుకు కేసీఆర్ 2001కి ముందు కుట్ర చేశారని ఆరోపించారు. 1999 ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదని.. దాంతో ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మరికొందరితో కలిసి, ఎమ్మెల్యేలను చీల్చి చంద్రబాబు స్థానంలో కేసీఆర్ సీఎం కావాలనుకున్నారని వెల్లడించారు. […]