అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్ లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే ఈ ఘటనలో రాకేష్ అనే యువకుడు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) స్పందించింది. మీడియా కథనాలను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ సంఘటనలపై జులై 20 వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్పీఎఫ్, జీఆర్పీ, డీజీపీలను ఆదేశించింది. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ […]