పర్యావరణ పరిరక్షణకు కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఒకసారి వాడి పారేసిన 16 రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని నిర్ణయించింది. ఈ వస్తువలపై నిషేధం జులై ఒకటవతేదీ నుంచే అమలులోకి వస్తుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు ప్లాస్టిక్ ముడిసరుకును సరఫరా చేయవద్దని పెట్రోకెమికల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు! వాణిజ్య సంస్థలేవీ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా […]