అసోం

అసోం రాష్ట్రాన్ని వరద విషాదం వ‌ద‌ల‌డంలేదు. బ్ర‌హ్మ‌పుత్ర‌, గౌరంగ్ వాటి ఉప‌న‌దులు పొంగి ప్ర‌వ‌హిస్తూ నేటికీ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుదేల‌వుతున్నాయి. సాధారణ జనజీవనం స్తంభించింది. రాజధాని గువహటి వీధుల్లోనూ వరద నీరు పారుతోంది. ఇప్పటి వరకు 25 మందికి పైగానే మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎనిమిది మంది ఆచూకీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ఇక్క‌ట్ల పాల‌య్యారు. వ‌ర‌ద నీరు 4,291 గ్రామాల‌ను ముంచెత్త‌గా […]