Telugu Global
Sports

ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్!

బ్యాడ్మింటన్ ప్రపంచ మహిళల టీమ్ టోర్నీ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువజట్టు దూసుకెళ్ళింది. సింధు లాంటి స్టార్ ప్లేయర్ లేకుండానే ఈ ఘనత సాధించింది.

ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్!
X

బ్యాడ్మింటన్ ప్రపంచ మహిళల టీమ్ టోర్నీ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువజట్టు దూసుకెళ్ళింది. సింధు లాంటి స్టార్ ప్లేయర్ లేకుండానే ఈ ఘనత సాధించింది.

భారత మహిళా బ్యాడ్మింటన్లోకి నవతరం ప్లేయర్లు దూసుకొస్తున్నారు. వెటరన్ పీవీ సింధు లాంటి ప్రపంచ మేటి ప్లేయర్ లేకున్నా..భారతజట్టు..టీమ్ విభాగంలో రాణించగలదని తొలిసారిగా నిరూపించారు.

చైనాలోని చెగ్డు వేదికగా జరుగుతున్న 2024- ఉబెర్ కప్ టోర్నీ గ్రూప్-ఏ లీగ్ నుంచి భారత యువజట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలిగింది.

సింగపూర్ పై 4-1 విజయం...

కెనడా, సింగపూర్, చైనా జట్లతో కూడిన గ్రూప్ -ఏ లీగ్ లో భారత్ వరుసగా రెండో విజయంతో క్వార్టర్ ఫైనల్స్ లో చోటు ఖాయం చేసుకోగలిగింది. ప్రారంభరౌండ్లో కెనడాను చిత్తు చేసిన భారత్ ...కీలక రెండోరౌండ్లో సింగపూర్ ను సైతం 4-1తో చిత్తు చేయగలిగింది.

అశ్మిత చలిహా, ప్రియా కోంచెంగ్ బామ్, శృతి మిశ్రా, ఇషారాణీ బారువా, సిమ్రాన్ సింగి, రితకా ఠాకూర్ లతో కూడిన భారత జట్టు కళ్లు చెదిరే విజయం సాధించింది.

ప్రారంభసింగిల్స్ లో అష్మితపై సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్ విజయం సాధించడం ద్వారా సింగపూర్ కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చింది.

అయితే..తొలి డబుల్స్ లో ప్రియా-శృతి జోడీ కీలక విజయంతో స్కోరు 1-1తో చేయగలిగారు.

రెండో సింగిల్స్ లో ఇషారాణి బారువా...సింగపూర్ ప్లేయర్ ఇన్ సియారా ఖాన్ ను వరుస గేమ్ ల్లో చిత్తు చేయడం ద్వారా భారత ఆధిక్యాన్ని 2-1కు పెంచింది.

రెండో డబుల్స్ లో భారత జోడీ సిమ్రాన్- రితికా జోడీ ..సింగపూర్ జంట ఇల్సా లాయ్- మిచెల్లి జాన్ లపై వరుసగేమ్ ల విజయంతో క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేశారు.

మూడోసింగిల్స్ లో అన్మోల్ ఖరాబ్ తిరుగులేని విజయంతో భారత్ 4-1 విజయాన్ని పూర్తి చేయగిలిగింది.

గ్రూప్ ఆఖరి రౌండ్లో చైనాతో పోరు...

గ్రూప్- ఏ విజేతను నిర్ణయించడానికి జరిగే ఆఖరి రౌండ్ పోరులో టాప్ సీడ్, ప్రపంచ మేటి చైనాతో భారతయువజట్టు తలపడనుంది. చైనా చేతిలో ఓడినా భారత్ కు వచ్చిన నష్టం ఏమీలేదు. క్వార్టర్ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఏ జట్టో తేలిపోనుంది.

పురుషుల టీమ్ చాంపియన్లకు ఇచ్చే థామస్ కప్ ను భారత్ గతంలో గెలుచుకోగా..మహిళల టీమ్ చాంపియన్లకు ఇచ్చే ఉబెర్ కప్ లో మాత్రం భారత్ ఇప్పటి వరకూ విజేతగా నిలువలేకపోయింది.

స్టార్ ప్లేయర్ పీవీ సింధు..ఒలింపిక్స్ సన్నాహాలలో ఉండటంతో ఉబెర్ కప్ టోర్నీకి దూరమయ్యింది. డబుల్స్ జట్లు అశ్వనీ- తనీషా జోడీ, గాయత్రీ గోపీచంద్- రీస్ జోడీ సైతం..ఉబెర్ కప్ లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

First Published:  29 April 2024 8:34 AM GMT
Next Story