యశ్ కు పిలుపొచ్చింది!
బోర్డర్ - గవాస్కర్ సిరీస్ కోసం పంపిన బీసీసీఐ
BY Naveen Kamera19 Nov 2024 3:48 PM IST

X
Naveen Kamera Updated On: 19 Nov 2024 3:48 PM IST
యంగ్ స్పీడ్ గన్ యశ్ డయల్ కు పిలుపొచ్చింది. ఆస్ట్రేలియా తో ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్టుల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడే భారత జట్టులో యశ్ కు చోటు కల్పించారు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించలేదు. యశ్ తండ్రి మాత్రం తన కొడుకు బీసీసీఐ సూచన మేరకు ఆస్ట్రేలియాకు వెళ్లాడని చెప్పారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టీ20ల సిరీస్ కు యశ్ ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో చోటు దక్కలేదు. యశ్ సౌతాఫ్రికాలో ఉన్నప్పుడే ఆస్ట్రేలియా కు రావాలని పిలుపొచ్చిందని, దీంతో 17న ఆస్ట్రేలియాకు వెళ్లాడని యశ్ తండ్రి తెలిపారు. ఇండియా టీమ్ కు బ్యాకప్ ప్లేయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పారు.
Next Story