Telugu Global
Sports

టెస్టులీగ్ లో విరాట్ కొహ్లీ జంట రికార్డులు!

భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో తొలిటెస్టు తొలిరోజుఆటలోనే జంట రికార్డులు నమోదు చేశాడు...

టెస్టులీగ్ లో విరాట్ కొహ్లీ జంట రికార్డులు!
X

భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో తొలిటెస్టు తొలిరోజుఆటలోనే జంట రికార్డులు నమోదు చేశాడు...

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో మాత్రమే కాదు..సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు తొలిరోజు ఆటలోనే విరాట్ తన పేరుతో జంట రికార్డులను లిఖించుకొన్నాడు.

అత్యధిక పరుగుల భారత బ్యాటర్...

జోహెన్స్ బర్గ్ లోని సెంచూరియన్ వేదికగా ప్రారంభమైన తొలిటెస్టులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 24 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టిన తరుణంలో క్రీజులోకి వచ్చిన విరాట్ .4వ వికెట్ కు శ్రేయస్ అయ్యర్ తో కలసి 67 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు.

విరాట్ మొత్తం 64 బంతులు ఎదుర్కొని 5 బౌండ్రీలతో 38 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

38 పరుగుల స్కోరు సాధించడం ద్వారా...మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మల పేర్లతో ఉన్న రెండువేర్వేరు రికార్డులను విరాట్ తెరమరుగు చేశాడు.

2019లో ప్రారంభమైన ఐసీసీ టెస్టులీగ్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా రోహిత్ శర్మ పేరుతో ఉన్న రికార్డును విరాట్ అధిగమించాడు.

రోహిత్ మొత్తం 42 ఇన్నింగ్స్ లో 2097 పరుగులతో సాధించిన రికార్డును విరాట్ 57 ఇన్నింగ్స్ లో 2101 పరుగులు సాధించడం ద్వారా సరికొ్త రికార్డు నెలకొల్పాడు.

టెస్టులీగ్ లో చతేశ్వర్ పూజారా 62 ఇన్నింగ్స్ లో 1769, అజింక్యా రహానే 49 ఇన్నింగ్స్ లో 1589, రిషభ్ పంత్ 41 ఇన్నింగ్స్ లో 1575 పరుగులతో మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు.

సచిన్,వీరూల తర్వాతి స్థానంలో విరాట్....

భారత్ తరపున దక్షిణాఫ్రికాపై మూడో అత్యుత్తమ బ్యాటర్ గా విరాట్ మరో రికార్డును ఖాయం చేసుకొన్నాడు. సెంచూరియన్ పార్క్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత తొలిటెస్టులో విరాట్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం ద్వారా రాహుల్ ద్రావిడ్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. దక్షిణాఫ్రికా పై ద్రావిడ్ సాధించిన 1252 పరుగుల రికార్డును విరాట్ అధిగమించాడు.

ప్రస్తుత టెస్టులో వ్యక్తిగతంగా 70 పరుగులు సాధించగలిగితే వీరేంద్ర సెహ్వాగ్ రికార్టును సైతం విరాట్ అధిగమించే అవకాశం ఉంది. వీరేంద్ర సెహ్వాగ్ తన కెరియర్ లో సఫారీలపై ఆడిన 15 టెస్టుల్లో 1306 పరుగులు సాధించడం ద్వారా భారత రెండో అత్యుత్తమ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.

దక్షిణాఫ్రికా పై అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ రికార్డు మాస్టర్ సచిన్ పేరుతో ఉంది. .

సచిన్ తన కెరియర్ లో దక్షిణాఫ్రికా పై ఆడిన మొత్తం 25 టెస్టుల్లో 1741 పరుగులతో 42.46 సగటు సాధించాడు.సచిన్ రికార్డును సైతం అధిగమించాలంటే మరో 500 పరుగులు చేయాల్సి ఉంది.

వన్డే ఫార్మాట్లో 50 శతకాలు బాదిన విరాట్ కు టెస్టు క్రికెట్లో 28 సెంచరీలు ఉన్నాయి.

First Published:  27 Dec 2023 4:56 PM IST
Next Story