అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు.. కింగ్ కోహ్లీకి రికార్డులు దాసోహం
లీగ్‌లో అత్యధిక పరుగుల రికార్డు, అత్యధిక సెంచరీల రికార్డులు తన పేరునే లిఖించుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యంత దురదృష్టమైన టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఒక్కసారి కూడా విజేతగా నిలవని ఆ జట్టులో రికార్డుల రారాజు కింగ్ కోహ్లీకి మాత్రం రికార్డులన్నీ దాసోహమవుతూనే ఉన్నాయి. లీగ్‌లో అత్యధిక పరుగుల రికార్డు, అత్యధిక సెంచరీల రికార్డులు తన పేరునే లిఖించుకున్నాడు. వన్డే తరహా బ్యాటింగ్ చేస్తున్నాడని విమర్శకులు ఎన్ని కామెంట్లు చేసినా కోహ్లీ లేకపోతే ఆర్సీబీ బ్యాటింగ్ ఏ స్థాయికి పడిపోతుందో అందరికీ తెలుసు.
8వ సెంచరీ
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అతనికిది 8వ శతకం. అత్యధిక శతకాలు కోహ్లీవే. ఇదే మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ ఆరు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన గేల్ కూడా ఐపీఎల్‌లో ఆరు సెంచరీలు బాదాడు.
7500 పరుగులు
నిన్నటి మ్యాచ్‌లో సెంచరీతో కోహ్లీ ఐపీఎల్‌లో 7.500 పరుగుల మార్కును దాటాడు. 234 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 6755 పరుగులతో రెండో స్థానంలో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఉన్నాడు.