Telugu Global
Sports

వెంకటేశ్‌ అయ్యర్‌ అ'ధర'హో!

రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా.. ఆర్చర్‌ ను రూ.12.50 కోట్లకు కొన్న బెంగళూరు

వెంకటేశ్‌ అయ్యర్‌ అధరహో!
X

వెంకటేశ్‌ అయ్యర్‌ ను దక్కించుకోవడానికి ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆయనపై కోట్ల రూపాయలతో బిడ్‌ చేస్తూ పోయాయి. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ.23.75 కోట్లకు అయ్యర్‌ ను దక్కించుకుంది. ఇంగ్లండ్‌ స్పీడ్‌ స్టర్‌ జోఫ్రా ఆర్చర్‌ కు ఐపీఎల్‌ మెగా వేలంలో మంచి ధర దక్కింది. ఆయన కోసం ముంబయి ఇండియన్స్‌, బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ పోటీ పడ్డాయి. బెంగళూరు రూ.12.50 కోట్లకు ఆర్చర్‌ ను కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ జోష్‌ హాజెల్‌వుడ్‌ ను రూ.12.50 కోట్లే వెచ్చించి బెంగళూరు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ పిల్‌ సాల్ట్‌ను రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇండియన్‌ యంగ్‌ కీపర్‌ జితేశ్‌ శర్మకు బెంగళూరు రూ.11 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ప్రసిధ్‌ కృష్ణను గుజరాత్‌ టైటాన్స్‌ రూ.9.50 కోట్లకు దక్కించుకుంది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ ను కొనుగోలు చేసేందుకు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.11.25 కోట్లు వెచ్చించింది. ఆస్ట్రేలియా ఆల్‌ రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ ను కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది.

సౌత్‌ ఆఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ ను కోల్‌కతా నైట్‌ రైజర్స్‌ రూ.3.60 కోట్లకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా దనాదన్‌ బ్యాటర్‌ మ్యాక్స్‌వెల్‌ ను పంజాబ్‌ కింగ్స్‌ లెవన్‌ రూ.4.20 కోట్లకు, ఆస్ట్రేలియాకే చెందిన ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ను రూ.3.40 కోట్లకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ దక్కించుకున్నాయి. రహమానుల్లా గుర్బాజ్‌ ను కోల్‌కతా రూ.2 కోట్లు చెల్లించి దక్కించుకుంది. ఖలీల్‌ అహ్మద్‌ ను చెన్నై రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఫాస్ట్‌ బౌలర్‌ నటరాజన్‌ ను ఢిల్లీ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. ఆన్రిచ్‌ నొట్రెజ్‌ను కోల్‌కతా రూ.6.50 కోట్లకు సొంతం చేసుకుంది. ట్రెంట్‌ బౌల్ట్‌ ను ముంబయి ఇండియన్స్‌ రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మెగా వేలంలో ముంబయి కొనుగోలు చేసిన మొదటి ప్లేయర్‌ బౌల్ట్‌. రాజస్థాన్‌ జట్టు తీక్షణను రూ.4.40 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్‌ మెగా వేలంలో దేవదత్‌ పడిక్కల్‌, డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టోను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో ఉన్న ముగ్గురు క్రికెటర్లు అన్‌సోల్డ్‌ జాబితాలో ఉన్నారు.

First Published:  24 Nov 2024 8:51 PM IST
Next Story