Telugu Global
Sports

అండర్ 19:శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఈ విజయంతో ఆసియా కప్ టోర్నీలో ఫైనల్ కు చేరిన భారత్

అండర్ 19:శ్రీలంకపై భారత్ ఘన విజయం
X

అండర్ 19 ఆసియా కప్ టీ 20 టోర్నీలో భాగంగా సూపర్ 4లో శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 99 రన్స్ లక్ష్యాన్ని 14.5 ఓవర్లలోనే ఛేదించింది. గొంగడి త్రిష 32, కమిలిని 28, మిథిల (17*) రన్స్ చేశారు. లంక బౌలర్లలో మనసింఘే 3, శశిని 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది.

సానికా చాల్కే (4), ఈశ్వరి (0) విఫలమవడంతో టీమిండియా 5 రన్స్ కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత త్రిష, కమిలిని నిలకడగా ఆడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. తర్వాత వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. కెప్టెన్ నిక్కీ ప్రసాద్ (3) కూడా నిరాశపరిచారు. ఈ దశలో భవికా (7) అండతో మిథిల జట్టును విజయపథాన నడిపించారు.

శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ మనుడి నానయక్కర (33), సుముడు నిసంసాల (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సజనా కవిండి (9), రష్మిక (8), హిరుణి హన్సిక (2), దహమి (5), లిమాన్స (1) సింగిల్ డిజిట్ కే పెవిలియన్ దారిపట్టారు. భారత బౌలర్లలో ఆయూషి శుక్లా (4/10) మరోసారి మెరిసింది. పరుణికా సిసోడియా 2, షబ్నమ్ షకీల్, ధృతి కేసరి ఒక్కో వికెట్‌ తీశారు.

First Published:  20 Dec 2024 10:46 AM IST
Next Story