అండర్-19: 10 ఓవర్లకు ఇంగ్లండ్ 74/2 రన్స్
భారత్‌తో సెమీస్.. బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడటానికి సిద్ధమైంది. టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో మరో సెమీస్ విజేత సౌతాఫ్రికాను ఢీ కొట్టనున్నది. వరుస విజయాలతో కొనసాగుతున్న భారత్ సెమీస్‌లోనూ గెలువాలనే కృత నిశ్చయంతో ఉన్నది.బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతున్నది. పది ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 73 రన్స్ చేసింది. ప్రస్తుతం కెప్టెన్ అబీ నారోగ్రోవ్, డేవినా సారా పెర్రిన్ క్రీజులో ఉన్నారు.పరునికా సిసోడియాకు రెండు వికెట్లు దక్కాయి.
తుది జట్లు
భారత్: కమలిని (కీపర్), గొంగడి త్రిష, సనికా చల్కే, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఐష్వరి, మిథాలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత, షబ్నమ్ షకిల్, పరునికా సిసోడియా, వైష్ణవి శర్మ
ఇంగ్లండ్: డేవినా సారా పెర్రిన్, జెమీమా స్పెన్స్, ట్రేడే జాన్సన్, అబీ నారోగ్రోవ్ (కెప్టెన్), స్టబ్స్, కేటీ జోన్స్ (కీపర్), ప్రిషా, టిల్లే, ఫోబ్ బ్రెట్, ఛార్లెట్ లాంబేర్ట్, సురేంకుమా