Telugu Global
Sports

వరుస రెండు సెంచరీల సీక్రెట్‌ చెప్పిన తిలక్‌

దక్షిణాఫ్రికాపై నాలుగు మ్యాచ్‌ల్లో తిలక్‌ 280 రన్స్‌ చేయగా వాటిలో 21 ఫోర్లు, 20 సిక్సర్లు ఉండటం గమనార్హం

వరుస రెండు సెంచరీల సీక్రెట్‌ చెప్పిన తిలక్‌
X

దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన టీమిండియా బ్యాటర్‌ తిలక్‌ వర్మ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డును సొంతం చేసుకున్నాడు. నాలుగో టీ 20లోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. ఈ క్రమంలో తన ఆట తీరుపై తిలక్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. గత సిరీస్‌లో తాను డకౌట్‌ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో గేమ్‌ ఛేంజర్‌గా టీమిండియా బౌలర్‌ వరుణ్‌ చక్రవర్తి నిలిచాడు.

దక్షిణాఫ్రికాపై వరుసగా రెండో సెంచరీ చేయడం సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా మీకో ఫన్నీ విషయం చెబుతున్నా. గత ఏడాది ఇదే వేదికపై (జోహెన్నెస్‌బర్గ్‌)గా ఆడిన మ్యాచ్‌లో మొదటి బాల్‌కే డకౌట్‌ అయ్యాను. మరోసారి అవకాశం వస్తే నిరూపించుకోవాలని బలంగా అనుకున్నాను. ఇప్పుడు ఈ సెంచరీతో ఆ లోటును భర్తీ చేసుకున్నాను. భారత్‌ విజయం సాధించిన ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించినందుకు మరింత ఆనందంగా ఉందన్నారు. గత మ్యాచ్‌లో ఎలాంటి ఆటతీరును ప్రదర్శించానో.. ఇప్పుడూ అవే సూత్రాలకు కట్టుబడి బ్యాటింగ్‌ చేశాను. కెప్టెన్‌ సూర్యకుమార్‌కు మరోసారి ధన్యవాదాలు చెబుతున్నాను. దక్షిణాఫ్రికాలో కఠిన సవాళ్లు ఉంటాయని తెలుసు. ఈ సిరిస్‌కు ముందు గాయాలకు గురయ్యాను. కోలుకొని వచ్చాక మైదానంలో దిగడానికి చాలా శ్రమించాను. అందుకే ఆ దేవుడికి కోసం నా సంబరాలను అలా చేసుకున్నానని తిలక్‌ వెల్లడించారు. నాలుగు మ్యాచ్‌ల్లో తిలక్‌ 280 రన్స్‌ చేశాడు. 21 ఫోర్లు, 20 సిక్సర్లు ఉండటం విశేషం.

First Published:  16 Nov 2024 11:46 AM IST
Next Story