Telugu Global
Sports

బంగ్లాతో టెస్ట్‌ సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా

బంగ్లాతో టెస్ట్‌ సిరీస్‌ క్లీన్‌స్వీప్‌
X

కాన్పూర్‌ టెస్ట్‌లో భారత్‌ అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో అదరగొట్టింది. రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. రెండో టెస్టులోను రోహిత్‌ సేన ఘన విజయం సాధించింది. 95 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్సింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. రోహిత్‌ శర్మ (8), శుభ్‌మన్‌ గిల్‌ (6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. యశస్వీ జైస్వాల్‌ (51), విరాట్‌ కోహ్లీ (29 నాటౌట్‌) రాణించాడు. ఈ క్రమంలో యశస్వీ మరో హాఫ్‌ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. మరో మూడు రన్స్‌ అవసరమవగా.. యశస్వి భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌ (4 నాటౌట్‌)తో కలిసి కోహ్లీ వికెట్‌ పడనీయకుండానే 17.2 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగించాడు.తాజా గెలుపుతో స్వదేశంలో భారత్‌ టెస్టు సిరీస్‌ విజయాల పరంపరం కొనసాగుతున్నది.

అంతకుముందు భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ (3/50), రవీంద్ర జడేజా (3/34), జస్‌ప్రీత్ బుమ్రా (3/17) ధాటికి బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఆ జట్టు 146 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.బంగ్లాదేశ్‌ మొదటి ఇన్సింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌ 285/9 స్కోరు వద్ద ఇన్సింగ్స్‌ను డిక్లెర్‌ చేసిన సంగతి తెలిసిందే. స్వదేశంలో వరుసగా 18వ సిరీస్‌ను భారత్‌ గెలిచినట్లయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమిండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నది. రాబోయే ఎనిమిది టెస్టుల్లో మరో మూడు గెలిచినా భారత్‌ టాప్‌-2 ఉండి ఫైనల్‌కు చేరడం ఖాయం.


First Published:  1 Oct 2024 8:50 AM GMT
Next Story