టీమిండియా ఆల్‌రౌండ్ షో.. బంగ్లాను చిత్తు చేసిన భారత్
బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడా భారత్ ఘన విజయం
మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శన తో 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. 128 రన్స్ లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలో ఛేదించింది. సంజు శాంసన్ (29), అభిషేక్ శర్మ (16), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (29) పరుగులు చేశారు. నితీశ్‌కుమార్ రెడ్డి (16 నాటౌట్), హార్దిక్ పాండ్య (39 నాటౌట్)గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, హసన్ మిరాజ్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన 19.5 ఓవర్లలో 127 రన్స్ చేసి ఆలౌటైంది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27), హెహిదీ హసన్ మిరాజ్ (35 నాటౌట్) మినహా బంగ్లా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. తౌహిద్ హృదయ్ (12), తస్కిన్ అహ్మద్ (12), రిసాద్ హొస్సేన్ (11) రన్స్ చేశారు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్య, మయాంక్ యాదవ్, వాషింగ్టన్, హార్దిక్ పాండ్య, నితీశ్ తలో వికెట్ తీశారు . రెండో టీ20 ఢిల్లీ వేదికగా బుధవారం (అక్టోబర్ 9న) జరగనున్ది.