Telugu Global
Sports

మూడో టీ20లో సఫారీ జట్టుపై టీమిండియా విజయం

సెంచరీతో కదం తొక్కిన తిలక్‌..ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అతనికే

మూడో టీ20లో సఫారీ జట్టుపై టీమిండియా విజయం
X

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌ 11 రన్స్ తేడాతో గెలుపొందింది. తిలక్‌ వర్మ సెంచరీతో అదరగొట్టిన వేళ.. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్‌ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన సఫారీ జట్టు.. చివరి వరకు పోరాడినా 7 వికెట్ల నష్టానికి 208 రన్స్‌ చేయగలిగింది. బ్యాటర్లలో చివరివరకు పోరాడినా 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో యాన్సెన్‌ (54), క్లాసెస్‌ (41) రాణించినా.. ఆ జట్టు ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3, వరుణ్‌ 2 వికెట్లు తీయగా.. హార్దిక్‌, అక్షర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంతో ఉన్నది.

అంతకు ముందు తిలక్‌ వర్మ (107 నాటౌట్‌) సెంచరీతో కదం తొక్కాడు. అభిషేక్‌ శర్మ (50) హాఫ్‌ సెంచరీ సాధించాడు. సాధారణంగా వన్‌డౌన్‌లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం తిలక్‌ వర్మ ముందుకు వచ్చి సెంచరీ బాదాడు. ఈ క్రమంలో తిలక్‌పై సూర్య ప్రశంసలు కురిపించాడు.

సెంచరీ కంటే మ్యాచ్‌ గెలువడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని తిలక్‌ వర్మ అన్నాడు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనన్నాడు. దేవం కోసం ఆడాలి.. సెంచరీ చేయాలన్నది నా కల. ఇప్పుడు ఫలించిందన్నాడు. ఈ క్రెడిట్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌కే దక్కుతుందన్నాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు తిలక్‌కే దక్కింది.

First Published:  14 Nov 2024 10:15 AM IST
Next Story