బంగ్లాతో రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం
బంగ్లాదేశ్‌తో మూడు టీ20 సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో కైవసం చేసుకున్నది. బుధవారం జరిగిన రెండో టీ-20లో టీమిండియా 86 రన్స్ తేడాతో గెలుపొందింది. మొదట నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. భారత్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 రన్స్ చేసింది. మహ్మదుల్లా (41) ఒక్కడే రాణించాడు. పర్వేజ్ హొస్సేన్ (16), లిటన్ దాస్ (14), నజ్ముల్ శాంటో (11), తౌహిద్ హృదయ్ (2), మోహదీ హసన్ మిరాజ్ (16) రన్స్ చేశారు. భారత బౌలర్లలో నితీశ్ 2, చక్రవర్తి 2, అర్ష్‌దీప్, సుందర్, అభిషేక్, మయాంక్, పరాగ్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు టీ20ల సీరిస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకున్నది. మూడో టీ20 శనివారం (అక్టోబర్ 12న) హైదరాబాద్ వేదికగా జరగనున్నది.
అంతకుముందు భారత బ్యాటర్లలో నితీశ్‌రెడ్డి (74) మెరుపు ఇన్సింగ్స్‌తో అదరగొట్టాడు. రింకుసింగ్ (53) కూడా మెరుపులు మెరిపించాడు. హార్దిక్ పాండ్యా (32) రాణించాడు. ఓపెనర్లు సంజు శాంసన్ (10) అభిషేక్ శర్మ (10), మొదటి మూడు ఓవర్లలోనే వెనుదిరిగారు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8) కూడా నిరాశపరిచాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్, తంజిమ్, ముస్తాఫిజురు, రిషాద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.