Telugu Global
Sports

ఐపీఎల్‌ చరిత్రలోనే శ్రేయాస్‌ అయ్యర్‌ కు రికార్డు ధర

జెడ్డా వేదికగా ఐపీఎల్‌ వేలం ప్రారంభం

ఐపీఎల్‌ చరిత్రలోనే శ్రేయాస్‌ అయ్యర్‌ కు రికార్డు ధర
X

ఐపీఎల్‌ మెగా వేలం మొదలైంది. ఊహించిన విధంగానే శ్రేయాస్‌ అయ్యర్‌ రికార్డు ధర పలికాడు. రూ. 26.75 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ శ్రేయస్‌ను దక్కించుకున్నది. దీంతో గత ఏడాది ఆస్ట్రేలియా మిచెల్‌ స్టార్క్‌ సాధించిన రికార్డు (24.75) రికార్డు బద్దలైంది. దీంతే శ్రేయస్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. కనీస ధర రూ. 2 కోట్లు ఉన్న అతని కోసం మొదట కోలకతా, ఢిల్లీ పోటీ పట్టాయి. తర్వాత పంజాబ్‌ రేసులోకి వచ్చింది. చివరకు పంజాబ్‌ కింగ్స్‌ రూ 26.75 కింగ్స్‌ సొంతం చేసుకున్నది. మరోవైపు అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఆర్డీఎమ్‌ కార్డు ద్వారా రూ. 18 కోట్లకు పంజాబే తీసుకున్నది. కనీస ధర రూ. 2 కోట్లు ఉన్న భారత ఫేసర్‌ కోసం మొదట్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్‌ అతని తీవ్రంగా పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్‌, బెంగళూరు, రాజస్థాన్‌ కూడా అతని కోసం బిడ్‌ వేశాయి. చివరికి ఆర్‌టీఎమ్‌ను ప్రయోగించిన పంజాబ్‌ రూ. 18 కోట్లకు సొంతం చేసుకున్నది. ఇక కనీస ధర రూ. 2 కోట్లు ఉన్న కగిసో రబాడను రూ. 10.75 కోట్లకు గుజారత్‌ టైటాన్స్‌ దక్కించుకున్నది. జోస్‌ బట్లర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ 15.75 కోట్లకు దక్కించుకున్నది. మిచెల్‌ స్టార్క్‌ రూ. 11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకున్నది.

ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత ఉందంటే?

వేలంలో ఆటగాళ్లను కొనుక్కోవడానికి మొత్తం పది ఫ్రాంఛైజీల వద్ద రూ. 641.5 కోట్లు ఉన్నాయి అత్యధికంగా రూ. 110.50 కోట్లతో పంజాబ్‌ కింగ్స్‌ వేలంలో వేటకు సిద్ధమైంది. రూ. 83 కోట్లతో బెంగళూరు రూ. 73 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో వేలంలో పాల్గొన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌, లఖ్‌నవూ, సూపర్‌ జెయింట్స్‌ చెరో రూ. 69 కోట్లతో సిద్ధమయ్యాయి. అత్యల్పంగా రాజస్థాన్‌ రాయల్స్‌ వద్ద రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. కోల్‌కతా వద్ద రూ. 51 కోట్లు.. ముంబయి, సన్‌రైజర్స్‌ చేతిలో చెరో 45 కోట్లు ఉన్నాయి.

204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలు

ఐపీఎల్‌ కొత్త సీజన్‌కు ఇంకా చాలా రోజులే ఉన్నది. అంతకుముందే ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడటానికి ఐపీఎల్‌ మెగా వేలం వచ్చేసింది. జెడ్డా వేదికగా ఆటగాళ్లను కొనుక్కోవడానికి, కోట్లు వెదజల్లడానికి నేటి నుంచి ఫ్రాంఛైజీలు పోటీపడుతున్నాయి. ఎవరు జాక్‌పాట్ కొడతారు.. ఎవరు ఆశ్చర్యపరుస్తారు. ఎవరు నిరాశ చెందుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో పది ఫ్రాంఛైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు, 210 మంది విదేశీలున్నారు. వీరిలో 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలున్నది.

First Published:  24 Nov 2024 4:38 PM IST
Next Story