సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ
రెండో ఇన్నింగ్స్ దూకుడుగా ఆడుతున్న భారత బ్యాటర్లు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో తొలి ఇన్సింగ్స్‌లో 46 రన్స్ కే ఆలౌట్ అయి చెత్త రికార్డును నమోదు చేసిన టీమిండియా రెండో ఇన్సింగ్స్‌లో దూకుడుగా ఆడుతున్నది. భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తొలి అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేశాడు. నాలుగో టెస్టులోనే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. ఓవర్‌నైట్ 70 రన్స్‌తో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన సర్ఫరాజ్ ఏ దశలోనూ ఒత్తిడికి గురికాలేదు. అద్భుతమైన షాట్స్‌తో అలరించాడు. ఆఫ్‌సైడ్ లేట్ కట్టర్లతో బౌండరీలు బాదాడు. రిషభ్ పంత్ కలిసి ఇన్సింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 106, రిషభ్ పంత్ 23 నాటౌట్ క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్సింగ్‌లో 402 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 294/3 . టీమిండియా ఇంకా 64 రన్స్ వెనుకబడి ఉన్నది.నాలుగో రోజు చెలరేగి ఆడి న్యూజిలాండ్ ముందు 200 పైగా టార్గెట్ పెడితే ఐదోరోజు నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం కష్టమని టీమిండియా భావిస్తున్నది.