టీమిండియా – బంగ్లాదేశ్ మధ్య ఈనెల 12న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే టీ 20 3వ మ్యాచ్ టికెట్లను శనివారం నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నామని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్, యాప్ లో టికెట్లు అమ్మకానికి పెడుతామని వెల్లడించారు. టికెట్ల ధర రూ.750 నుంచి రూ.15 వేల వరకు ఉందని వివరించారు. ఆన్‌లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈనెల 8వ తేదీ నుంచి 12 వరకు జింఖానా గ్రౌండ్స్ లో ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రిడంప్షన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు చూపించి, ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకున్న ప్రింట్ చూపించి టికెట్లు పొందాలని తెలిపారు. ఆఫ్ లైన్ టికెట్లు అమ్మడం లేదని స్పష్టం చేశారు.
Previous Articleటాస్ ఓడిన భారత్..న్యూజిలాండ్ బ్యాటింగ్
Next Article శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం దశదిశలా చాటేలా
Keep Reading
Add A Comment