రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ ఆడుతాడు
హిట్‌మ్యాన్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌పై అతని చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ సాధించిన తర్వాత హిట్‌మ్యాన్ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరే అవకాశం ఉన్నది. ఈ టోర్నీ ఫైనల్ తర్వాత రోహిత్ వన్డేలు, టెస్టులకు రిటైర్మెంట్ పలుకుతాడని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే దినేశ్ లాడ్ స్పందించాడు.
రోహిత్ శర్మ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను చెప్పడం లేదు. అయితే అతనికి వయసు మీద పడుతున్నందున టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడని అనిపిస్తున్నది. వన్డే క్రికెట్‌కు పూర్తిగా ఫిట్గా ఉండటానికి అతను ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడుతాడని నేను వంద శాతం విశ్వసిస్తున్నాను. అతను క్రికెట్ అద్భుతంగా అడుతున్నాడని దినేశ్ తెలిపాడు.