Telugu Global
Sports

ధోనీ, విరాట్ సరసన రోహిత్!

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పలు అరుదైనరికార్డులతో హేమాహేమీల సరసన చోటు సంపాదించాడు.

ధోనీ, విరాట్ సరసన రోహిత్!
X

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పలు అరుదైనరికార్డులతో హేమాహేమీల సరసన చోటు సంపాదించాడు.

ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మోత మోగిస్తున్నాడు. జట్టు నాయకుడిగా, ఓపెనర్ గా జట్టుకు ముందుండి విజయపథంలో నడిపిస్తున్నాడు.

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఆఖరిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకం సాధించడం ద్వారా రోహిత్ భారత ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల సరసన నిలిచాడు.

మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా 1000 పరుగుల రికార్డు...

భారత కెప్టెన్ గా క్రికెట్ మూడు ( టెస్టు, వన్డే, టీ-20 ) ఫార్మాట్లలోనూ వెయ్యి పరుగులు సాధించిన భారత మూడో కెప్టెన్ గా రోహిత్ రికార్డుల్లో చేరాడు. గతంలో ఇదే ఘనత సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల సరసన నిలిచాడు.

ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ వ్యక్తిగతంగా 52 పరుగులు సాధించడం ద్వారా ఈ ఘనత దక్కించుకోగలిగాడు.

అంతేకాదు..టెస్టు చరత్రలో వెయ్యి పరుగుల మైలురాయి చేరిన 6వ కెప్టెన్ గా గుర్తింపు పొందాడు.రోహిత్ కంటే ముందే ఈ రికార్డు నెలకొల్పిన కెప్టెన్లలో ధోనీ, ఫాఫ్ డుప్లెసిస్, కేన్ విలియమ్స్ సన్, విరాట్ కొహ్లీ, బాబర్ అజమ్ ఉన్నారు.

భారత 10వ కెప్టెన్ గా రోహిత్....

9 దశాబ్దాల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో జట్టు కెప్టెన్ గా 1000 పరుగులు సాధించిన 10వ కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డుల్లో చోటు సంపాదించాడు. ఇంతకుముందే ఈ ఘనత సాధించిన దిగ్గజ కెప్టెన్లలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, మహ్మద్ అజరుద్దీన, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కొహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు.

ప్రస్తుత సిరీస్ లోని రాజకోట, ధర్మశాల టెస్టుల్లో రోహిత్ శతకాలు బాదడం ద్వారా తన టెస్టు సెంచరీల సంఖ్యను 12కు పెంచుకోగలిగాడు.

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 4వ సెంచరీ...

ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ 103 పరుగులు సాధించడం ద్వారా తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 48కి పెంచుకొన్నాడు. 36 ఏళ్ల రోహిత్ భారత కెప్టెన్ గా 12వ శతకం నమోదు చేశాడు.

కెప్టెన్ గా అత్యధిక శతకాలు ( 13 ) బాదిన ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ తర్వాతి స్థానంలో రోహిత్ నిలిచాడు. ఐసీసీ టెస్టు లీగ్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్లలో మార్నుస్ లబుషేన్ ( 11), కెన్ విలియమ్స్ సన్ (10) , బాబర్ అజమ్ ( 8) ఉన్నారు.

ద్రావిడ్, గవాస్కర్ రికార్డు సమం...

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ సాధించిన రికార్డును రోహిత్ ..ధర్మశాల టెస్టు శతకంతో సమం చేయగలిగాడు. 48 అంతర్జాతీయ శతకాలు సాధించిన రాహుల్ ద్రావిడ్ రికార్డును సైతం రోహిత్ సమం చేయగలిగాడు. టెస్టు, వన్డే, టీ-20 ఫార్మాట్లలో రోహిత్ కు ఇది 48వ శతకం.

టెస్టుల్లో 12, వన్డేలలో 31, టీ-20లో 5 శతకాలు సాధించిన ఘనత రోహిత్ కు దక్కుతుంది.

భారత ఓపెనర్ గా అత్యధిక శతకాలు సాధించిన సునీల్ గవాస్కర్ రికార్డును సైతం రోహిత్ సమం చేయగలిగాడు. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా ఆడిన 38 టెస్టుల్లో గవాస్కర్ కు 4 శతకాలు సాధించిన రికార్డు ఉంది.

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 4వ శతకం సాధించడం ద్వారా రోహిత్ సైతం గవాస్కర్ రికార్డును చేరుకోగలిగాడు. ధర్మశాల టెస్టు రెండోరోజుఆటలో రోహిత్ 162 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

మాస్టర్ సచిన్ సరసన రోహిత్....

30 ఏళ్లు పైబడిన తరువాత అత్యధిక అంతర్జాతీయ శతకాలు బాదిన క్రికెటర్ రికార్డును సైతం రోహిత్ అందుకొన్నాడు. మాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేయగలిగాడు.

30 సంవత్సరాల తరువాత సచిన్, రోహిత్ చెరో 35 అంతర్జాతీయ సెంచరీలతో సమఉజ్జీలుగా నిలిచారు. టెస్టు చరిత్రలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 30 ఏళ్లు పైబడిన తరువాత రికార్డు స్థాయిలో 43 శతకాలు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

మాథ్యూ హేడన్ 36, రికీ పాంటింగ్ 36, రోహిత్ శర్మ 35, సచిన్ టెండుల్కర్ 35 సెంచరీలతో ఆ తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.

ఓపెనర్ గా రోహిత్ మరో రికార్డు...

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా అత్యధిక శతకాలు బాదిన భారత ఓపెనర్లలో ఒకడిగా రోహిత్ నిలిచాడు. గవాస్కర్ పేరుతో ఉన్న 4 సెంచరీల రికార్డును రోహిత్ సమం చేశాడు.

విజయ్ మర్చెంట్ 3, మురళీ విజయ్ 3, కెఎల్ రాహుల్ 3 సెంచరీలు సాధించిన భారత ఓపెనర్లుగా ఉన్నారు.

2021 సీజన్ తర్వాత నుంచి అత్యధికంగా 6 శతకాలు బాదిన భారత క్రికెటర్ గా రోహిత్ మరో రికార్డు సాధించాడు. శుభ్ మన్ గిల్ 4, జడేజా 3, యశస్వి జైశ్వాల్ 3, రిషభ్ పంత్ 3, రాహుల్ 3 శతకాలతో నిలిచారు.

First Published:  9 March 2024 7:45 AM IST
Next Story