Telugu Global
Sports

కెప్టెన్‌ కావడం వల్లనే రోహిత్‌ టీమ్‌ లో కంటిన్యూ అవుతున్నడు

లేకపోతే ఆయనకు జట్టులో స్థానం కష్టమే.. : ఇర్ఫాన్‌ పఠాన్‌

కెప్టెన్‌ కావడం వల్లనే రోహిత్‌ టీమ్‌ లో కంటిన్యూ అవుతున్నడు
X

కెప్టెన్‌ కావడం వల్లనే రోహిత్‌ శర్మ టీమ్‌ లో కంటిన్యూ అవుతున్నాడని.. లేకపోతే ఆయనకు స్థానం కష్టమేనని టీమిండియా మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నారు. కొన్నాళ్లుగా ఆయన ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. సరిగా పరుగులు చేయలేకపోతున్నాడు. కెప్టెన్‌ కావడం వల్లనే తుది జట్టులో చోటు దక్కుతోంది.. లేకుంటే ఆయనకు ప్లేస్‌ కష్టమేనని పఠాన్‌ వ్యాఖ్యానించారు. స్వదేశంలో న్యూజిలాండ్‌ తో టెస్ట్‌ సిరీస్‌తో పాటు బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో రోహిత్‌ బ్యాట్‌ తో ప్రభావం చూపించలేకపోయాడు. స్వదేశంలో కివీస్‌ తో జరిగిన టెస్టు మ్యాచ్‌ లో ఒక హాఫ్‌ సెంచరీ మాత్రమే చేశాడు. పరుగులు రాబట్టేందుకు తంటాలు పడుతున్న రోహిత్‌ ఇక టెస్టు క్రికెట్‌ కు వీడ్కోలు పలకడమే మంచిదని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీలో ఇండియా ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్‌ లో రోహిత్‌ లేకపోవడంతోనే గెలుపు సాధ్యమైందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. బోర్డర్‌ -గవాస్కర్‌ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్‌ పై రోహిత్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని రవిశాస్త్రి అన్నారు.

First Published:  30 Dec 2024 6:22 PM IST
Next Story